News February 22, 2025

24న నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 24న CM రేవంత్ రెడ్డి నిజామాబాద్‌కు వస్తున్నట్లు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్లో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. నరేందర్ రెడ్డిని గెలిపించాలన్నారు.

Similar News

News January 16, 2026

నిజామాబాద్‌లో కొండెక్కిన ధరలు

image

నిజామాబాద్‌లో చికెన్ ధరలు కొండక్కాయి. కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ. 320 ఉండగా, స్కిన్ చికెన్ 300గా ఉంది. లైవ్ చికెన్ లైవ్ చికెన్ రూ.260 గా ఉంది. చేపలు రవాటాలు కిలో రూ.200 ఉండగా, మొట్ట చేపలు రూ.700 కిలోకు విక్రయిస్తున్నారు. అయితే సంక్రాంతి కనుమ పండుగ కావడంతో అధిక మొత్తంలో మాంసం తినడం ఆచారంగా వస్తోంది. మాంసం కొనేందుకు సైతం అధిక ఆసక్తి కనబడుతున్నారు.

News January 16, 2026

నిజామాబాద్‌లో కొండెక్కిన చికెన్ ధరలు

UPDATE: పతంగుల షాపు యజమానికి 14 రోజుల రిమాండ్

image

నిజామాబాద్ టూటౌన్ పరిధిలో హెడ్ పోస్ట్ ఆఫీస్ సమీపంలో నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్న సుల్తాన్ కైట్ షాపుపై ఈనెల 1న పోలీసులు దాడి చేసి చేసిన సంగతి తెలిసిందే. అయితే పరారీలో ఉన్న షాపు యజమాని ఫహీమ్ అన్సారీని గురువారం అరెస్ట్ చేసి కోర్టుకు తరలించగా 14 రోజుల రిమాండ్ విధించారని టూ టౌన్ SI సయ్యద్ ముజాయిద్ తెలిపారు.