News March 21, 2024
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ కన్నుమూత
పాకిస్థాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయీద్ అహ్మద్ (86) అనారోగ్యంతో కన్నుమూశారు. 1958-1973 మధ్య ఆయన పాక్ తరఫున 41 టెస్టులు ఆడి 2,991 పరుగులు చేశారు. ఈ క్రమంలో 5 సెంచరీలు సాధించిన ఆయన, అందులో 3 భారత్‌పైనే నమోదు చేశారు. ఆఫ్ స్పిన్ వేసే సయీద్ తన టెస్ట్ కెరీర్‌లో మొత్తం 22 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్‌తో జరిగిన 3 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించారు.
Similar News
News January 9, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News January 9, 2025
దోమలను చంపేందుకు కొత్త ప్లాన్!
మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులకు కారణమైన దోమల నివారణకు ఆస్ట్రేలియాలోని మాక్వేరీ వర్సిటీ పరిశోధకులు సరికొత్త విధానాన్ని కనుగొన్నారు. మనుషులను కుట్టే ఆడ దోమలతో శృంగారం చేసే మగ దోమల వీర్యాన్ని విషపూరితం చేయాలని చూస్తున్నారు. దీంతో దోమల బెడద తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈగలపై చేసిన ప్రయోగం సత్ఫలితాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఎవరికీ హాని లేదని నిర్ధారించాకే ముందుకు వెళ్తామన్నారు.
News January 9, 2025
తక్షణమే టోకెన్ల జారీ.. కేంద్రాల వద్ద అదనపు బలగాలు
తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో టీటీడీ అప్రమత్తమైంది. రద్దీ పెరగడంతో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను తక్షణమే జారీ చేయాలని నిర్ణయించింది. భక్తులను అదుపు చేసేందుకు అన్ని కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించారు. పరిస్థితిని ఎస్పీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆయనతో హోంమంత్రి అనిత ఫోన్‌లో మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సూచించారు.