News February 22, 2025
హీరో రామ్ పోతినేనితో మంత్రి కందుల భేటీ

టాలీవుడ్ హీరో రామ్ పోతినేనిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ షూటింగ్ సెట్‌లో కలిశారు. రాజమండ్రిలో వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంత్రి తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. కాగా ‘RAPO22’ మూవీ కోసం రామ్ రాజమండ్రిలో ఉన్నారు. కొద్ది రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మినిస్టర్ ఆయనను కలిశారు.
Similar News
News February 23, 2025
SSMB29పై ఏప్రిల్‌లో రాజమౌళి ప్రెస్‌మీట్?

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో SSMB29 మూవీ షూటింగ్ ఇప్పటికే కొనసాగుతోంది. ఈ క్రమంలో దర్శకధీరుడు ఏప్రిల్‌లో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడిస్తారని సమాచారం. మూవీ బడ్జెట్, నటీనటుల వివరాలు, షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది? రిలీజ్ ఎప్పుడు? లాంటి విషయాలు వివరిస్తారని తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రియాంకా చోప్రా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
News February 23, 2025
ఇవాళ జనసేన శాసనసభాపక్ష సమావేశం

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ఇవాళ జనసేన పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ జరగనుంది. బడ్జెట్‌పై అవగాహన, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి? బడ్జెట్‌పై ఎలా చర్చించాలి అనే అంశాలపై పవన్ దిశా నిర్దేశం చేయనున్నారు.
News February 23, 2025
మూడేళ్లలోనే బీటెక్ కంప్లీట్?

TG: మూడేళ్లలోనే బీటెక్ కోర్సు పూర్తయ్యేలా సిలబస్ మార్చేందుకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తులు చేస్తోంది. AICTE మోడల్ కరిక్యులాన్ని పరిగణనలోకి తీసుకుని కొత్త కరిక్యులం రూపొందించేందుకు కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగో ఏడాదిని విద్యార్థులు ఇంటర్న్‌షిప్/ప్రాజెక్టు రూపంలో పూర్తి చేయాల్సి ఉంటుంది.