News February 22, 2025
లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న కలెక్టర్

బీబీనగర్ మండల పరిధిలోని పడమటి సోమవారంలో లింగ బసవేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో జిల్లా కలెక్టర్ హనుమంతరావు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ హనుమంతరావుకు నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ఛైర్మన్ సందిగారి బసవయ్య, ధర్మకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
ఖమ్మం: వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి

వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. మద్దివారిగూడెంకు చెందిన వీరవెంకటమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 4రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు పూర్తికాగా, అప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్న వీరవెంకటమ్మ కోడలు కృష్ణవేణి సైతం శనివారం మృతి చెందింది. వారం వ్యవధిలోనే అత్తాకోడళ్లు మృతి చెందడంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.
News February 23, 2025
రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 లక్షలకుపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రూ.1,460 కోట్లకుపైగా నిధులు విడుదల కానున్నాయి.
News February 23, 2025
రఘువర్మకే జనసేన మద్దతు: మంత్రి నాదెండ్ల

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మకే తమ మద్దతు ఉంటుందని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఉభయగోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం ఏ విధంగా జనసేన అండగా నిలుస్తుందో.. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఒకే మాటపై నిలబడాలన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రఘువర్మకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లు పడేలా చూడాలన్నారు.