News February 22, 2025
వీడిన సందిగ్ధం.. ఇక సిద్ధమై సత్తా చాటండి!

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై APPSC తాజా ప్రకటనతో సందిగ్ధం వీడింది. రేపు యథాతథంగా పరీక్షలు జరగనుండగా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని ముందుగానే ఎగ్జామ్ సెంటర్లు ఉన్న ఆయా ప్రాంతాలకు చేరుకోండి. మొక్కవోని దీక్ష, ఎన్నో కష్టాలకు ఓర్చి పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులంతా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. భవిష్యత్తుకు మార్గం చూపే చక్కటి అవకాశం కావడంతో ఓర్పు, నేర్పుతో పరీక్ష రాయండి. ALL THE BEST.
Similar News
News February 23, 2025
రూ.4.5 కోట్ల లాటరీ తగిలింది.. కానీ

రొట్టె విరిగి నేతిలో పడ్డట్లుగా దొంగలకు ₹4.5Cr లాటరీ తగిలింది. అయితే చోరీ చేసిన ATM కార్డుతో దాన్ని కొనడంతో అరెస్టు భయంతో తేలు కుట్టిన దొంగల్లా ఉండిపోయారు. లాటరీని సమంగా పంచుకునేందుకు ఒప్పుకుంటే కేసును ఉపసంహరించుకుంటానని కార్డు యజమాని ప్రకటించాడు. విజేత వస్తే డబ్బు ఇస్తామంటూ నిర్వాహకులు నిరీక్షిస్తున్నారు. ఈ విచిత్ర పరిస్థితి ఫ్రాన్స్‌లో చోటుచేసుకుంది. ఎవరూ రాకపోతే ప్రభుత్వానికి సొమ్ము వెళ్తుంది.
News February 23, 2025
ట్రంప్ వ్యాఖ్యలు ఆందోళనకరం: జైశంకర్

భారత ఎన్నికల్లో US నిధులను కేటాయించారన్న ట్రంప్ ఆరోపణలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర కలవరపాటుకు గురిచేశాయి. భారత అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యం ఆందోళన కలిగిస్తోంది. USAID నిధులపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. పూర్తి విచారణ తర్వాతే దీనిపై అన్ని వివరాలు వెల్లడిస్తాం’ అని ఆయన తెలిపారు.
News February 23, 2025
సీఎం రేవంత్‌కు ఫోన్ చేసిన రాహుల్

TG: SLBC టన్నెల్ ప్రమాదం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న రాహుల్, సహాయక చర్యలపై ఆరా తీశారు. మరోవైపు SLBC టన్నెల్ దగ్గర కాంట్రాక్టర్, ఏజెన్సీలు, రెస్క్యూ సిబ్బందితో మంత్రులు ఉత్తమ్, జూపల్లి సహాయక చర్యలపై చర్చిస్తున్నారు.