News February 22, 2025
సత్యసాయి జిల్లా TODAY TOP NEWS

*సత్యసాయి: 42 కేంద్రాలలో ఇంటర్ పరీక్షలు
*పెనుకొండలో అంతర్రాష్ట్ర దొంగ <<15545614>>అరెస్ట్<<>>
* బుక్కపట్నం చెరువులో 1,36000 చేప పిల్లలు వదిలిన MLA
*కుంభమేళాలో మంత్రి సత్యకుమార్ స్నానం
*గుత్తి: బావిలో విద్యార్థి గల్లంతు
* సత్యసాయి జిల్లాలో తెలుగు టీచర్ సస్పెండ్
*పెద్దకోడిపల్లి చెరువులో చేపలు వదిలిన మంత్రి <<15548666>>సవిత<<>>
Similar News
News July 4, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త?

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెలలో 2025 డీఏ పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం 55శాతం డీఏను 59శాతానికి పెంచుతారని తెలుస్తోంది. జులై నుంచే ఈ పెంపు అమల్లోకి రానుండగా, బకాయిలు మాత్రం 2026 జనవరి 1 తర్వాతే చెల్లిస్తారని సమాచారం. రానున్న 2 నెలల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా రెండు సార్లు జనవరి, జులైలో డీఏను సవరిస్తారు.
News July 4, 2025
ట్యాంక్‌బండ్‌లో దూకిన మహిళ.. కాపాడిన యువకుడు

హుస్సేన్‌సాగర్‌లో దూకి ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. స్థానికుల వివరాలు.. రామంతాపూర్‌కు చెందిన మహిళ శుక్రవారం ట్యాంక్‌బండ్ మీదకు వచ్చింది. ఒక్కసారిగా నీటిలో దూకేసింది. ఇది గమనించిక ట్యాంక్‌బండ్ శివ కుమారుడు హుస్సేన్‌సాగర్‌లోకి దిగారు. నీటిలో మునుగుతున్న ఆమెను బ్లూ కోట్ పోలీసుల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. మహిళ సూసైడ్ అటెంప్ట్‌కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
News July 4, 2025
మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా బాలయ్య నియామకం

మెదక్ పోక్సో కోర్టు ప్రత్యేక పీపీగా న్యాయవాది బాలయ్య నియమితులయ్యారు. ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్పెషల్ పీపీగా నియమితులైన బాలయ్యను మెదక్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో అధ్యక్షులు మర్కంటి రాములు, కార్యదర్శి శిరిగా కరుణాకర్, ఉపాధ్యక్షులు ఆకుల శ్రీనివాస్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.