News February 22, 2025
15 ని. ముందే సెంటర్లకు చేరుకోవాలి: APPSC

AP: రేపు గ్రూప్-2 మెయిన్స్ ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని ప్రకటించిన APPSC.. అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం ఉ.10 గం. నుంచి మ.12.30 గం. వరకు పేపర్-1, మ.3 నుంచి సా.5.30 వరకు పేపర్-2 ఉంటుందని పేర్కొంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. 92,250 మంది మెయిన్స్ రాయనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లు ఏర్పాటు చేసింది.
Similar News
News February 23, 2025
INDvsPAK: భారత జట్టులో మార్పులుంటాయా?

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ భారత్-పాక్ పోరుకు రంగం సిద్ధమైంది. ఈ మ్యాచ్‌కు టీమ్ ఇండియా ఫైనల్ 11లో ఎవరుంటారనే చర్చ మొదలైంది. బంగ్లాతో ఆడిన జట్టునే కొనసాగిస్తారని విశ్లేషకులు అంటున్నారు. అయితే కుల్దీప్ స్థానంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, హర్షిత్ ప్లేస్‌లో యార్కర్ల స్పెషలిస్ట్ అర్ష్‌దీప్‌ను తీసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు ఏ ప్లేయర్ బెస్ట్? మీ కామెంట్.
News February 23, 2025
మళ్లీ ఏడాది కోర్సుగా B.Ed, M.Ed?

AP: బీఈడీ, ఎంఈడీ కోర్సులను తిరిగి ఏడాది కోర్సులుగా ప్రవేశపెట్టాలని NCTE యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై NCTE వెబ్‌సైట్‌లో ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోనుంది. ఆ తర్వాత ఏడాది ఫార్మాట్‌లోకి మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పదేళ్ల క్రితం B.Ed, M.Ed కోర్సులు ఏడాది పాటే ఉండగా, రెండేళ్లకు పొడిగించిన విషయం తెలిసిందే.
News February 23, 2025
రేపే అకౌంట్లలోకి పీఎం కిసాన్ నిధులు

పీఎం కిసాన్ 19వ విడత నిధులను కేంద్ర ప్రభుత్వం రేపు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేయనుంది. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో జరిగే కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ నిధులు విడుదల చేస్తారు. దేశంలోని 9.8 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేయనున్నారు. కాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 లక్షలకుపైగా రైతులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుంది. రూ.1,460 కోట్లకుపైగా నిధులు విడుదల కానున్నాయి.