News February 22, 2025
కర్ణాటకకు బస్ సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో MSRTCపై KRV (కన్నడ రక్షక వేదిక) ప్రతినిధులు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో నిలిపేసింది. పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించనున్నారు.
Similar News
News February 23, 2025
రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు

TG: బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రాం లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
News February 23, 2025
ప్రజలంతా ఫిట్‌గా ఉండాలి: ప్రధాని మోదీ

దేశ ప్రజలంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఒబేసిటీ సమస్యను ప్రధాని ప్రస్తావించారు. నగరాల్లో పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతోందని చెప్పారు. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలని పిలుపునిచ్చారు.
News February 23, 2025
దుమ్మురేపుతున్న ‘ఛావా’@రూ.300 కోట్లు

మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 10రోజుల్లోనే ₹300Cr కలెక్షన్లను సాధించింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేసిన 8వ చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో పుష్ప-2 హిందీ వెర్షన్(5రోజులు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత జవాన్(6D), పఠాన్(7D), యానిమల్(7D), గదర్-2(8D), స్త్రీ-2(8D), బాహుబలి-2 హిందీ(10D) ఉన్నాయి. ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రలు పోషించారు.