News March 21, 2024

మహేశ్ ఫ్యాన్‌కు కార్తికేయ అదిరిపోయే రిప్లై

image

జపాన్‌లో భూకంపం భయాందోళనలకు గురిచేసినట్లు SS కార్తికేయ <<12894254>>ట్వీట్<<>> చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మహేశ్ అభిమాని ఒకరు స్పందిస్తూ మహేశ్-రాజమౌళి మూవీ ట్రైలర్‌ ఇంపాక్ట్‌కు రిహార్సల్ చేస్తున్నారని కార్తికేయను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. దీనికి కార్తికేయ అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ఆ ఇంపాక్ట్ జపాన్‌లోనే కాకుండా ప్రపంచమంతా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో హైప్‌కే పోయేలా ఉన్నామని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Similar News

News April 12, 2025

పాఠ్యాంశాల్లో ‘వనజీవి’ జీవిత కథ

image

TG: వనజీవి <<16071045>>రామయ్య<<>> అసలు పేరు దరిపల్లి రామయ్య. వృక్షో రక్షతి రక్షితః అంటూ మొక్కల పెంపకాన్ని ప్రచారం చేశారు. తన కుటుంబ సభ్యులకు చెట్ల పేర్లను పెట్టడం ప్రకృతి పట్ల ఆయన ప్రేమకు నిదర్శనం. గత ప్రభుత్వం హరితహారంలో ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇంటికి ఎవరు వచ్చినా ఒక మొక్కను గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఆయన కృషిని గౌరవిస్తూ ప్రభుత్వం 6వ తరగతి పాఠ్యాంశాల్లో రామయ్య జీవితాన్ని చేర్చింది.

News April 12, 2025

ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి

image

ఆస్ట్రేలియాలోని భారత కాన్సులేట్‌పై మళ్లీ దాడి జరిగింది. కాన్‌బెరాలోని రాయబార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గ్రాఫిటీతో జాతి విద్వేష నినాదాలను పెయింట్‌తో రాశారు. గతంలోనూ ఎంబసీపై ఈ దాడులు జరగడం గమనార్హం. అధికారులకు ఫిర్యాదు చేశామని భారత హైకమిషన్ తెలిపింది. దర్యాప్తు చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారని వెల్లడించింది.

News April 12, 2025

గాజా ‘భూమిపై నరకం’: రెడ్ క్రాస్

image

గాజా ప్రస్తుత పరిస్థితి భూమిపై నరకంలా ఉందని రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ మిర్జానా స్పొల్‌జారిక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అక్కడ తాగేందుకు నీరు లేదు. కరెంట్ లేదు. ఆహారం అసలే లేదు. సాయం చేయడానికి మిగిలి ఉన్న సరుకులు కూడా మరో 2 వారాల్లో అయిపోతాయి. ఆస్పత్రులు ఎలా నడపాలో తెలియట్లేదు. అత్యవసరంగా సీజ్ ఫైర్ అమలుచేయకపోతే పరిస్థితి చేయిదాటిపోయేలా ఉంది’ అని పేర్కొన్నారు.

error: Content is protected !!