News February 22, 2025
కోనసీమ జిల్లా TODAY TOP NEWS

➤ఆలమూరు: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
➤ DRKM: శివరాత్రి ఏర్పాట్లు సమీక్షించిన ఎస్పీ
➤ మండపేట: జాతీయస్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
➤ అమలాపురంలో సెలూన్, పార్లర్లో తనిఖీలు
➤ ఉప్పలగుప్తం: సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
➤ ముమ్మిడివరంలో అలరించిన 8 మంది కవలలు
➤ వాడపల్లిలో జబర్దస్త్ నటి సందడి
➤ అమలాపురం: కనువిందు చేసిన కవలలు
Similar News
News September 14, 2025
రోజా.. నువ్వు జబర్దస్త్ చేయలేదా?: దుర్గేశ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విమర్శించే స్థాయి వైసీపీ నేత రోజాకు లేదని మంత్రి కందుల దుర్గేశ్ ఫైర్ అయ్యారు. నువ్వు మంత్రిగా ఉండి కూడా జబర్దస్త్‌లో పాల్గొనలేదా అని ఆయన ప్రశ్నించారు. ‘పవన్‌కు డబ్బు యావ లేదు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును కూడా ఆయన ప్రజలకే ఖర్చు చేస్తున్నారు. మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రాజెక్ట్ అయినా రాష్ట్రానికి తీసుకువచ్చారా. ప్రజా సమస్యలు తీర్చారా?’ అని ఆయన మండిపడ్డారు.
News September 14, 2025
నరసరావుపేట: ‘మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి’

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ‘మీకోసం’ కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ప్రజలకు సూచించారు. సెప్టెంబర్ 15న కలెక్టరేట్‌లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు హాజరై మీ సమస్యలను తెలియజేయవచ్చని ఆమె తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను meekosam.ap.gov.inలో నమోదు చేసుకోవచ్చని, లేదా 1100 నంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
News September 14, 2025
రాజోలి: కరెంట్ షాక్‌తో యువకుడి మృతి

రాజోలి మండల కేంద్రానికి చెందిన సుజాత సోమేశ్వర్ రెడ్డి కుమారుడైన శివారెడ్డి (25) వరి పొలంలో ఉన్న బోరు మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి కరెంట్ షాక్‌తో ఆదివారం మృతి చెందాడు. పొలం పక్కన ఉన్న యువకుడు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వెంటనే స్థానిక పిహెచ్సి కేంద్రానికి వెళ్లగా సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా పోయింది. శివారెడ్డికి ఇటీవలే కొడుకు పుట్టాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.