News February 22, 2025

మత్స్యకారులు పథకాలు ఉపయోగించుకోవాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద అమలవుతున్న పథకాలను కృష్ణా జిల్లాలోని మత్స్యకారులు, ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీ.కే.బాలాజి కోరారు. కలెక్టరేట్‌లో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు సహకారంతో మత్స్య శాఖ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహయోజ పథకం వినియోగంపై శనివారం అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు ఇచ్చారు.

Similar News

News February 23, 2025

కృష్ణా: కేజి చికెన్ ధర ఎంత అంటే.!

image

మచిలీపట్నం, పెడన పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోయాయి. కేజీ చికెన్ విత్ స్కిన్ రూ.110, స్కిన్ లెస్ రూ.120గా ఉందని మాంసాహారులు చికెన్ దుకాణాల వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ పరిస్థితి కారణంగా వ్యాపారాలు పూర్తిగా క్షీణించాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ కిలోల కొద్దీ చికెన్ అమ్ముకునే వారు ఇప్పుడు తక్కువ పరిమాణంలో కూడా అమ్మకాలు సాగడంలేదని వాపోయారు. 

News February 23, 2025

కృష్ణా: నానిలు సేఫేనా.?

image

వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి. 

News February 23, 2025

ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలి: కలెక్టర్

image

ప్రకృతి వ్యవసాయం వల్ల పొందే లాభాలపై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన అధికారులు, గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం (సెర్ప్) సిబ్బందికి ప్రకృతి వ్యవసాయంపై శనివారం అవగాహన కల్పించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించే పంటలకు ఉన్న డిమాండ్‌ను రైతులకు తెలియజేయాలని సూచించారు. 

error: Content is protected !!