News February 22, 2025
సంగారెడ్డి: ఈనెల 24న పదో తరగతి పరీక్షలపై శిక్షణ

మార్చి నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలపై ఎంఈవోలకు, రూట్ ఆఫీసర్లకు, పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరిండెంటెంట్, డిపార్ట్మెంట్లకు ఈనెల 24న జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో ఉదయం 10 గంటలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు.ఈ శిక్షణలో జిల్లా కలెక్టర్ పాల్గొంటారని చెప్పారు.
Similar News
News February 23, 2025
ప్రజలంతా ఫిట్‌గా ఉండాలి: ప్రధాని మోదీ

దేశ ప్రజలంతా ఫిట్‌గా, ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మన్‌కీ బాత్‌లో ఒబేసిటీ సమస్యను ప్రధాని ప్రస్తావించారు. నగరాల్లో పిల్లలు, పెద్దల్లో ఒబేసిటీ సమస్య పెరుగుతోందని చెప్పారు. దీని వల్ల అనేక రకాల వ్యాధులు చుట్టుముడుతున్నాయని, పిల్లలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చూడాలని పిలుపునిచ్చారు.
News February 23, 2025
ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండండి: బెల్లంపల్లి ఎమ్మెల్యే

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పట్టణ స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టభద్రులతో కలిసి సమీక్ష నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులంతా నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు.
News February 23, 2025
దుమ్మురేపుతున్న ‘ఛావా’@రూ.300 కోట్లు

మరాఠా యోధుడు శంభాజీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ హిందీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. 10రోజుల్లోనే ₹300Cr కలెక్షన్లను సాధించింది. అత్యంత వేగంగా ఈ ఫీట్ నమోదు చేసిన 8వ చిత్రంగా నిలిచింది. ఈ జాబితాలో పుష్ప-2 హిందీ వెర్షన్(5రోజులు) టాప్‌లో ఉంది. ఆ తర్వాత జవాన్(6D), పఠాన్(7D), యానిమల్(7D), గదర్-2(8D), స్త్రీ-2(8D), బాహుబలి-2 హిందీ(10D) ఉన్నాయి. ఛావాలో విక్కీ కౌశల్, రష్మిక కీలక పాత్రలు పోషించారు.