News February 22, 2025
అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు: విశాఖ సీపీ

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలనీ, ఉమెన్ సేఫ్టీకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
Similar News
News February 23, 2025
విశాఖ: లోకల్‌బాయ్ నానికి రిమాండ్..!

సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి హెచ్చరించారు. విశాఖకు చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై అందిన ఫిర్యాదుల మేరకు అరెస్టు చేసినట్లు ఆదివారం ధ్రువీకరించారు. మెజిస్ట్రేట్ ముందు నానిని హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన మరికొందరిని గుర్తించామని.. వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు.
News February 23, 2025
ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News February 23, 2025
విశాఖలో పగడ్బందీగా గ్రూప్-2 పరీక్ష: కలెక్టర్

విశాఖ జిల్లాలోని 16 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష ఆదివారం ప్రారంభమైంది. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల పరిధిలోని పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మొదటి సెషన్స్‌లో 11,030 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. 9,293 మంది పరీక్షకు హాజరయ్యారు. 1,638 మంది గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రంలో గట్టి నిఘా ఏర్పాటు చేశారు.