News February 23, 2025

TODAY HEADLINES

image

* APలో రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం
* CM రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
* మిర్చి రైతులతో CM చంద్రబాబు కీలక భేటీ
* దేశంలో ఏ CM చేయని సాహసం చేస్తున్నా: రేవంత్
* అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలని YCP నిర్ణయం
* SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. చిక్కుకున్న కార్మికులు
* టెస్లాకు AP భారీ ఆఫర్.. లోకేశ్ ప్రత్యేక చొరవ!
* ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై ఆసీస్ విజయం

Similar News

News February 23, 2025

ఢిల్లీ రాజకీయాల్లో ఎర్రన్న ముద్ర చెరగనిది: లోకేశ్

image

AP: కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా మంత్రి లోకేశ్ నివాళులు అర్పించారు. ‘ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరచిపోని ప్రజా నాయకుడు ఎర్రన్నాయుడు. ప్రజా సమస్యలపై ఆయన స్పందించే విధానం, అనేక క్లిష్టమైన సమస్యలపై పోరాటం నేటి తరానికి ఆదర్శనీయం. రాష్ట్రానికి, తనని నమ్ముకున్న ప్రజలకి న్యాయం చెయ్యాలనే బలమైన సంకల్పం ఉంటే భాష అసలు సమస్యే కాదంటూ ఢిల్లీ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు’ అని కొనియాడారు.

News February 23, 2025

IND vs PAK: టాస్ ఓడిన భారత్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచులో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది. టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. IND: రోహిత్ (C), గిల్, కోహ్లీ, అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, షమీ, కుల్దీప్, హర్షిత్.
PAK: రిజ్వాన్ (C), బాబర్, ఇమాముల్, షకీల్, సల్మాన్, తాహిర్, ఖుష్‌దిల్, అఫ్రీదీ, నషీమ్ షా, హ్యారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

News February 23, 2025

BJP అభ్యర్థులను గెలిపించండి: కిషన్ రెడ్డి

image

TG: ఈ నెల 27న జరిగే పట్టభద్రులు, టీచర్స్ MLC ఎన్నికల్లో BJP అభ్యర్థులను గెలిపించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆదిలాబాద్‌లో ప్రముఖులు, మేధావులతో ఆయన సమావేశమయ్యారు. ‘KCRను గద్దె దించడానికి ప్రజలకు పదేళ్లు పట్టింది. కాంగ్రెస్‌కు 14 నెలల్లోనే ఈ పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అనే పరిస్థితి ఉంది. గాల్లో దీపంలా వారి హామీలు మారాయి. అభయహస్తం మొండిహస్తంగా మారింది’ అని ఎద్దేవా చేశారు.

error: Content is protected !!