News February 23, 2025

NZB: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: కిషన్ రెడ్డి

image

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన నిజామాబాద్‌లో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. 400 రోజులు దాటినా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీదే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News February 16, 2026

NZB: BRS మద్దతుతో కాంగ్రెస్ మేయర్ ఎంపిక

image

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కూరగాయల ఉమారాణి BRS కార్పోరేటర్ మద్దతుతో ఎంపికయ్యారు. కార్పొరేషన్ ఎన్నికల్లో 17 సీట్లు మాత్రమే సాధించిన కాంగ్రెస్, 14 సీట్లు గెలిచిన ఎంఐఎం, ఒకే సీటు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుతో ఛైర్‌పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు. 28 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన బీజేపీని వెనక్కి నెట్టేశారు.

News February 16, 2026

NZB: మేయర్ ఉమారాణి నేపథ్యమిదే!

image

నిజామాబాద్ నగరపాలక సంస్థ నూతన మేయర్‌గా ఎన్నికైన కూరగాయల ఉమారాణి నగరంలోని కసాబ్ గల్లికి చెందినవారు. ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వారు. గర్ల్స్ హై స్కూల్ 10వ తరగతి తరువాత ఇంటర్మీడియట్ చేసిన ఆమె ఓపెన్‌లో BA పూర్తి చేశారు. ఆమెకు నలుగురు సంతానం. ఒకరు డాక్టర్, ఇద్దరు ఇంజినీర్లు, మరొకరు MBA చేశారు. ఆమె భర్త కరాటే రమేశ్ అందరికీ సుపరిచతమే.

News February 16, 2026

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి సోమవారం తెలిపారు. ఈనెల 12వ తేదీన గాంధీచౌక్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉండగా 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతని ఒంటిపై బ్లూ కలర్ షర్టు, గ్రే కలర్ ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు.