News March 21, 2024
రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,090 పెరిగి రూ.67,420కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.1,000 పెరిగి రూ.61,800కి చేరింది. అటు కేజీ వెండి రూ.1,500 పెరిగి రూ.81,500 పలుకుతోంది. ఈ ఒక్క నెలలోనే గోల్డ్ రేట్లు 5% మేర పెరిగాయి. ఈ ఏడాది కీలక వడ్డీ రేట్లలో కనీసం 3 సార్లు తగ్గింపు ఉంటుందన్న అమెరికా ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ ప్రకటనతో పసిడి ధరలు పెరుగుతున్నాయి.
Similar News
News July 10, 2025
నిమిషకు ఉరిశిక్ష.. సుప్రీంకోర్టులో పిటిషన్

కేరళ నర్సు <<17009348>>నిమిష<<>> ప్రియ కేసులో కేంద్రం జోక్యం చేసుకోవాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 14కు విచారణను వాయిదా వేసింది. ఈ కేసులో భారత ప్రభుత్వం దౌత్యపరమైన జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరారు. కాగా వ్యాపారి హత్య కేసులో యెమెన్ ప్రభుత్వం నిమిషకు ఈ నెల 16న మరణశిక్ష అమలు చేయనున్నట్లు ప్రకటించింది. అటు కేంద్రం కూడా ఈ విషయంలో ఆమెను కాపాడాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
News July 10, 2025
HCAలో అక్రమాలు.. ముగ్గురిపై కేసు నమోదు

HYD క్రికెట్ అసోసియేషన్(HCA)లో నిధుల దుర్వినియోగంపై CID దర్యాప్తు జరుపుతోంది. అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కోశాధికారి శ్రీనివాస రావు, CEO సునీల్‌పై కేసు నమోదు చేసింది. వీరితో పాటు శ్రీచక్ర క్రికెట్ క్లబ్‌కు చెందిన రాజేందర్, కవితను అదుపులోకి తీసుకుంది. సంతకాల ఫోర్జరీ, నకిలీ దస్త్రాలు సృష్టించడంపై విచారిస్తోంది. కాగా SRHను బెదిరించిన కేసులో నిన్న జగన్మోహన్ <<17008940>>అరెస్ట్<<>> అయిన సంగతి తెలిసిందే.
News July 10, 2025
పూజారి అసభ్యంగా తాకాడు: నటి

మలేషియాలోని ఆలయంలో పూజారి తనను వేధించినట్లు భారత సంతతి నటి లిశల్లిని కనరన్‌ను ఆరోపించారు. గత నెల 21న సెపంగ్‌లోని మరియమ్మన్ టెంపుల్లో ఈ ఘటన జరగగా తాజాగా వెలుగులోకి వచ్చింది. పూజారి తనను అసభ్యంగా ఛాతీపై తాకుతూ భారత్ నుంచి తీసుకొచ్చిన పవిత్ర జలం అంటూ నీటిని తనపై పోశాడని ఆమె ఇన్‌స్టాలో ఆరోపించారు. దీనిపై ఈ నెల 4న మలేషియా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూజారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.