News February 23, 2025

ICC ఈవెంట్స్ అంటే ఆసీస్‌కు పూనకాలే..

image

కమిన్స్, స్టార్క్, హేజిల్‌వుడ్, మార్ష్ లేరు. స్టొయినిస్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఉన్న కొద్దిమంది సీనియర్లతో ఆసీస్ టీమ్ CTలో పాల్గొనేందుకు వచ్చింది. ENGతో తొలి మ్యాచ్‌లో కొండంత లక్ష్యం(352). స్మిత్, హెడ్ చెరో 5, 6 పరుగులు చేసి వెనుదిరిగారు. అయినా AUS గెలిచింది. ICC ఈవెంట్స్ అంటే ఆ జట్టు ఆటగాళ్లు ఊగిపోతారు. ఈసారి కొత్త ప్లేయర్ ఇంగ్లిస్ 86 బంతుల్లో 120 రన్స్ చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

Similar News

News February 23, 2025

జూనియర్ ఎన్టీఆర్ స్టైలిష్ లుక్(PHOTOS)

image

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ కలర్ సూట్‌లో గాగుల్స్ పెట్టుకుని చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. దీంతో తారక్ లుక్ అదిరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ WAR2, ప్రశాంత్ నీల్ సినిమాల్లో నటిస్తున్నారు.

News February 23, 2025

INDvsPAK: దుబాయ్‌లో బుమ్రా సందడి

image

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత స్టార్ బౌలర్ బుమ్రా దుబాయ్ స్టేడియానికి వచ్చారు. ఐసీసీ టీ20, టెస్ట్ టీమ్ క్యాపులు, టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, సర్ గ్యారీఫీల్డ్ సోబర్స్ అవార్డులు అందుకున్నారు. అనంతరం టీమ్ ఇండియా ప్లేయర్లతో కాసేపు ముచ్చటించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాల్సిన ఆయన గాయం కారణంగా టోర్నీకి దూరమైన సంగతి తెలిసిందే.

News February 23, 2025

అతడి వద్ద అమ్మాయిల నగ్న వీడియోలు, వేల ఫొటోలు

image

TG: యువతుల ప్రైవేటు వీడియోల కేసులో అరెస్టైన మస్తాన్ సాయి కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడి హార్డ్ డిస్క్‌లో 499 వీడియోలు, వేలకొద్దీ ఫొటోలు, ఆడియో కాల్స్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యువతులు వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసినవి, లావణ్యతో పాటు ఆమె ఫ్రెండ్స్‌ను లోబర్చుకున్నప్పుడు తీసిన వీడియోలు అందులో ఉన్నాయి. మూడేళ్లుగా అతడు వీటిని సేవ్ చేసుకున్నట్లు తేల్చారు.

error: Content is protected !!