News February 23, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,64,158 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,17,832, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.89,820 అన్నదానం రూ.56,506 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

Similar News

News November 8, 2025

కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టులో జియోకు 2 ఎకరాలు

image

TG: కవ్వాల్ టైగర్ రిజర్వు ఫారెస్టులో రిలయన్స్ కంపెనీ జియో డిజిటల్ ఫైబర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు దాదాపు 2 ఎకరాల అటవీ భూమిని ప్రభుత్వం కేటాయించింది. మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజన్లో ఈ భూమిని ఇచ్చారు. ఆ సంస్థ ఈ భూమిలో ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయనుంది. ప్రభుత్వం కొన్ని షరతులతో జీఓ విడుదల చేసింది. కేంద్ర అటవీ నిబంధనలకు లోబడి ఈ భూమిని కేటాయిస్తున్నట్లు వెల్లడించింది.

News November 8, 2025

జూబ్లీ బై పోల్: రేపటి నుంచి పోలీసుల తనిఖీలు

image

ఉపఎన్నిక ప్రచారం రేపు సా.5 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత స్థానికేతరులు ఎవ్వరూ నియోజకవర్గంలో ఉండరాదు. ఈ నిబంధనలు అతిక్రమిస్తే ఈసీ కఠిన చర్యలు తీసుకుంటుంది. అందుకే రేపు సాయంత్రం తర్వాత పోలీసులు నియోజకవర్గంలో ఉన్న ఫంక్షన్ హాళ్లు, గెస్ట్ హౌసులు, లాడ్జీలలో తనిఖీలు చేపడతారని ఎన్నికల అధికారి సాయిరాం తెలిపారు.

News November 8, 2025

ఖమ్మం: కడుపునొప్పి తాళలేక కార్మికుడి ఆత్మహత్య

image

తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక మిషన్ భగీరథలో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ కార్మికుడు తగరం నాగరాజు (36) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగరాజు ఉరివేసుకున్నాడు. ఈ విషయం స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.