News February 23, 2025

యాచారం: మహిళపై అత్యాచారం.. యువకుడికి రిమాండ్

image

మతిస్థిమితం లేని మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన యువకుడిని శనివారం యాచారం పోలీసులు రిమాండ్‌కు తరలించారు. యాచారం మండల పరిధిలోని మాల్‌లో ఉంటున్న మతిస్థిమితంలేని మహిళపై నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం ఎరుగండ్లపల్లికి చెందిన పోలే శ్రీశైలం (25) అనే యువకుడు గత డిసెంబర్ 9న అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా నిందితుని గుర్తించి రిమాండ్‌కు తరలించారు. 

Similar News

News March 3, 2026

రంగారెడ్డి జిల్లాలో ప్రధాన ఆలయాలు మూసివేత

image

పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ప్రధాన ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు ఫరూఖ్‌నగర్ మండంలోని ఉత్తరరామలింగేశ్వ రస్వామి, ఎలికట్ట అంబాభవానీ ఆలయాలు, చేవెళ్లలోని వేంకటేశ్వర ఆలయం, కడ్తాల్ మం.లోని మైసిగండి మైసమ్మతల్లి ఆలయం, నర్కుడలోని అమ్మపల్లి ఆలయ ద్వారాలు మూసివేశారు. గ్రహణం పూర్తయిన అనంతరం శుద్ధి చేసి తెరుస్తామన్నారు.

News March 2, 2026

RR: ప్రజావాణికి 51 ఫిర్యాదులు: కలెక్టర్

image

రంగారెడ్డిలో కలక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ నారాయణ రెడ్డికి విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. ప్రజావాణికి 51 ఫిర్యాదులు అందాయని, అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News March 1, 2026

RR: డ్వాక్రా మహిళలకు డిజిటల్ హెల్త్ ప్రొఫైల్

image

హెల్త్ మిషన్-100లో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని డ్వాక్రా మహిళలందరికీ 30 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ప్రత్యేక డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను సిద్ధం చేయబోతున్నామని DMHO డా.లలితాదేవి అన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 2,25,020 మంది మహిళా సభ్యుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.