News February 23, 2025

వర్గల్: జాతీయ శిబిరానికి ఎంపికైన డిగ్రీ విద్యార్థిని

image

ఒడిశా విశ్వవిద్యాలయంలో కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సమగ్రత శిబిరానికి వర్గల్ మహాత్మ బాపూలే మహిళా డిగ్రీ కళాశాలకు విద్యార్థిని వైష్ణవి ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్‌ భాస్కరరావు తెలిపారు. మార్చి 3 నుంచి 9 వరకు జరిగే జాతీయ సమగ్రత శిబిరానికి ఎంపిక కావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

Similar News

News July 6, 2025

తుని: గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ

image

తునిలో జ్యోతిరావు పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలను బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, వంటశాల, టాయిలెట్లు పరిశీలించారు. పిల్లల ఆరోగ్యాన్ని రోజూ పర్యవేక్షించాలని ప్రిన్సిపల్ యజ్ఞ‌ను ఆదేశించారు. మెరుగైన విద్యను అందించాలని సూచించారు.

News July 6, 2025

పోలీసు శాఖలో 2, 844 కేసులు రాజీ: ఎస్పీ

image

ఏలూరు జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్‌లో పోలీస్ శాఖకు సంబంధించిన 2,844 కేసులు రాజీ అయ్యాయని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆదివారం తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. 827 IPC కేసులు, 417 స్పెషల్ అండ్ లోకల్ లాస్ కేసులు, 143 ఎక్సైజ్ కేసులు, 1, 454 పెట్టీ కేసులు (చిన్నపాటి చట్టపరమైన నేరాలు)తో మొత్తం 2, 844 కేసులు రాజీ అయ్యాయన్నారు.

News July 6, 2025

WGL: రేపు వరంగల్ మార్కెట్ ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున:ప్రారంభం కానుంది. నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులకు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.