News February 23, 2025
భారత జాలర్లను విడుదల చేసిన పాకిస్థాన్

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మ్యాచ్ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పాక్ ప్రభుత్వం 22 మంది భారత జాలర్లను విడుదల చేయడం గమనార్హం. 2021-22లో తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ వారిని అరెస్ట్ చేసింది. 22 మందిలో 18 మంది గుజరాత్, ముగ్గురు డయ్యూ, ఒకరు యూపీకి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల విడుదలైన నాగచైతన్య ‘థండేల్’ స్టోరీ కూడా ఇలాంటి వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కించిందే.
Similar News
News February 23, 2025
‘రాజా సాబ్’ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజా సాబ్’ మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాప్ మోస్ట్ కమెడియన్స్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిశోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, యోగిబాబు, వీటీవీ గణేశ్ తదితరులను డైరెక్టర్ మారుతి తీసుకున్నట్లు టాక్. వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ రాసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.
News February 23, 2025
ఢిల్లీ అసెంబ్లీలో LOPగా ఆతిశీ

ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీ ఎన్నికయ్యారు. ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. దీంతో LOPగా ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలిచింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
News February 23, 2025
పెళ్లిలోనూ భారత్ VS పాక్ మ్యాచ్ LIVE

భారత్, పాకిస్థాన్ మ్యాచ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌లోని ఓ పెళ్లి మండపంలో మ్యాచ్‌ను చూసేందుకు ఏకంగా స్క్రీన్ ఏర్పాటు చేశారు. అతిథులు ఓ వైపు పెళ్లి, మరోవైపు మ్యాచ్‌ను ఆస్వాదిస్తున్నారు. ఇవాళ సండే కావడంతో దాదాపు అందరి ఇళ్లలోనూ టీవీల్లో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.