News February 23, 2025
హుస్నాబాద్: తండ్రికి తలకొరివి పెట్టిన తనయ

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ ఉదంతం హుస్నాబాద్ మండలంలోని తోటపల్లి గ్రామంలో శనివారం జరిగింది. వ్యవసాయంలో నష్టం రావడంతో బోనాల శ్రీనివాస్ (46) అనే రైతు పురుగు మందు సేవించి శుక్రవారం ఆత్మహత్యయత్నం చేయగా, హనుమకొండలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందాడు. శ్రీనివాస్‌కు ఇరువురు కుమార్తెలు ఉండడంతో అందులో పెద్ద కూతురు తండ్రి చితికి నిప్పు పెట్టింది.
Similar News
News February 23, 2025
కొమురవెల్లిలో కొనసాగుతున్న హాల్ట్ స్టేషన్

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న రైల్వే హాల్ట్ స్టేషన్ శరవేగంగా కొనసాగుతోంది. 2024, జనవరి 20న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ పాల్గొని భూమి పూజ చేశారు. కాగా ప్రస్తుతం 75% నిర్మాణ పనులు పూర్తయ్యాయి. త్వరలోనే పనులు పూర్తై అందుబాటులోకి రానుంది.
News February 23, 2025
GWL: పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్

ఉమ్మడి ఇటికాల మండలంలోని గురుకుల పాఠశాలల్లో ఆదివారం జరిగిన 2025 పీజీ సెట్ గురుకుల ప్రవేశ పరీక్ష కేంద్రాలను ఆదివారం గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పరిశీలించారు. పరీక్ష నిర్వహణ తీరు, కేంద్రాల వద్ద సౌకర్యాలను పరిశీలించారు. పరీక్షలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్వహించాలని సూచించారు. ప్రిన్సిపల్ రామాంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
News February 23, 2025
ఢిల్లీ అసెంబ్లీలో LOPగా ఆతిశీ

ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మాజీ సీఎం ఆతిశీ ఎన్నికయ్యారు. ఆప్ లెజిస్లేటివ్ మీటింగ్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమెను ఎన్నుకున్నారు. దీంతో LOPగా ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఆమె నిలిచారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 22 సీట్లు గెలిచింది. కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సౌరభ్ భరద్వాజ్ వంటి కీలక నేతలు ఓడిపోయిన సంగతి తెలిసిందే.