News February 23, 2025
SRD: మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు: ఎస్పీ

మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రూపేష్ అన్నారు. పటాన్చెరు మండలం రుద్రారం సమీపంలోని గీతం యూనివర్సిటీలో శిక్షణ సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ సంజీవరావు, డీఎస్పీలు సత్తయ్య గౌడ్, రవీందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 23, 2025
అమెరికా రాజకీయాల్లో తణుకు యువకుడు

అమెరికా రాజకీయాల్లో తణుకుకి చెందిన యువకుడు సత్తి ఆదిత్యరెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇటీవల హోరా హోరీగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ క్యాంపైన్ బృందంలో ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అంతకు ముందు ఆర్మీ నేషనల్ గార్డ్‌గా పనిచేసిన ఆయన రిపబ్లిక్ పార్టీలో, ట్రంప్ ప్రభుత్వంలో అధికారిక హోదా పొందబోతున్నారు. వైట్ హౌస్‌లో జరిగే దాదాపు అన్ని కార్యక్రమాలకు ఆయన ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు.
News February 23, 2025
బాపట్ల జిల్లా విద్యుత్ వినియోగదారులకు గమనిక

కరెంట్ బిల్లు చెల్లించుటకు బాపట్ల జిల్లాలోని అన్ని విద్యుత్ రెవెన్యూ కేంద్రాలలోని కౌంటర్లు ఆదివారం తెరిచే ఉంటాయని, బాపట్ల విద్యుత్ శాఖ సూపరింటెండ్ ఇంజినీర్ ఆంజనేయులు తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ వినియోగదారులు గమనించి, ఇప్పటివరకు విద్యుత్ బిల్లులు చెల్లించనివారు ఆదివారం బిల్లులను చెల్లించాలని కోరారు.
News February 23, 2025
BJPని గెలిపిస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది: R.కృష్ణయ్య

TG: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని గ్రాడ్యుయేట్లు, టీచర్లను ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘బీజేపీ ప్రభుత్వం వస్తే రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారుతుంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఇటీవల ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును దేశవ్యాప్తంగా ఇవ్వాలి. రాజకీయాల్లో నిజాయితీ ఉండాలి. ఓటర్లు చిన్న చిన్న ప్రలోభాలకు లొంగవద్దు’ అని సూచించారు.