News February 23, 2025
ASF: రైలుపట్టాలపై మృతదేహాలు

MNCL, ASF జిల్లాల్లో రైలు పట్టాలపై మృతదేహాలు లభ్యమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. సిర్పూర్(టి) సమీపంలో శుక్రవారం ఒక మృతదేహం కనిపించగా.. అంతకుముందు బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి ప్రాంతాల్లో పలు ఘటనలు వెలుగుచూశాయి. కొంతమంది వివిధ కారణాలతో రైళ్లకు ఎదురెళ్లి ప్రాణాలు విడుస్తుంటే.. మరికొందరు అనుకోని రీతిలో రైళ్ల కింద పడుతున్నారు. ఇక నెలలో పదుల సంఖ్యలో ఘటనలు జరగడం అందరినీ కలిచివేస్తోంది.
Similar News
News February 23, 2025
6,463 మంది పరీక్షలు రాశారు: అనంత కలెక్టర్

అనంతపురం జిల్లాలోని 14 సెంటర్లలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 మొదటి పేపర్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. మొత్తం 7,293 మంది పరీక్ష రాయాల్సి ఉండగా.. అందులో 6,463 మంది అభ్యర్థులు పరీక్ష రాశారని, 830 మంది అభ్యర్థులు హాజరు కాలేదని పేర్కొన్నారు. 88.61% ప్రజెంట్ పోల్ అయినట్లు ఆయన తెలిపారు.
News February 23, 2025
రేపు ఉ.10 గంటలకు..

AP: తిరుమల వేంకటేశ్వర స్వామి దర్శన టికెట్లు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన రూ.300 స్పెషల్ ఎంట్రీ టికెట్లను రేపు ఉదయం 10 గం.కు రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి కోటా టికెట్లు రేపు మ.3 గంటలకు విడుదల అవుతాయి. టికెట్లను దళారుల వద్ద కొనొద్దని https://ttdevasthanams.ap.gov.in/లోనే కొనుగోలు చేయాలని టీటీడీ సూచించింది.
News February 23, 2025
జనగామ: గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరు

జనగామ జిల్లా వ్యాప్తంగా నేడు(ఆదివారం) జరిగిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్షకు 51 మంది గైర్హాజరయ్యారని జిల్లా సాంఘీక సంక్షేమ గురుకుల డీసీవో శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 1,851 మంది 1,800 మంది హాజరయ్యారని తెలిపారు. ఇందులో 5వ తరగతిలో 16 మంది, 6వ తరగతిలో 14 మంది, 7వ తరగతిలో 12 మంది, 8వ తరగతిలో ఐదుగురు, 9వ తరగతిలో నలుగురు గైర్హాజరు అయ్యారని వెల్లడించారు.