News February 23, 2025
సిద్దిపేట: గ్రామం నుంచి జాతీయ స్థాయికి

బహుజన సమాజ్ పార్టీలో గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి కోఆర్డినేటర్గా ఎన్నికైన బెజ్జంకి మండల వాసి నిషాని రామ చంద్రంను శనివారం బెజ్జంకిలో మానకొండూర్ నియోజకవర్గ నాయకులు పలువురు ఘనంగా సన్మానించారు. బాధ్యతలను అప్పగించిన బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతికి ధన్యవాదాలు తెలిపారు. మాతంగి తిరుపతి, మల్లయ్య, నిషాని రాజమల్లు, సుమలత, గుర్రం సత్యనారాయణ, రాజు, కనకం రఘు పాల్గొన్నారు.
Similar News
News January 14, 2026
రైతాంగం సుభిక్షంగా ఉండాలి: కేసీఆర్

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమతో మూడు రోజుల పాటు పండుగ వైభవం కొనసాగుతుందని అన్నారు. పల్లెలన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ప్రకృతి సౌందర్యాన్ని చాటుతాయని, మకర సంక్రాంతికి హిందూ సంప్రదాయాల్లో విశేష ప్రాధాన్యం ఉందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సాగిన వ్యవసాయాభివృద్ధిని గుర్తుచేసుకుంటూ, రైతాంగం సుభిక్షంగా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
News January 14, 2026
HYD: భూగర్భజలాలు పాతాళానికి

భారీ వర్షాలు కురిసినా బల్దియాలోని భూగర్భజలాలు పడిపోతున్నాయి. నిరుడితో పోలిస్తే నీటిమట్టం 2-3 అడుగుల దిగువకు జారిందని అధికార గణాంకాలు చెబుతున్నాయి. GHMC పరిధిలోని 46 మండలాల్లో 13 మండలాలు రెడ్జోన్లోకి వెళ్లాయి. కాంక్రీటీకరణతో వర్షపు నీరు భూమిలోకి ఇంకకపోవడం ప్రధాన కారణం. బోర్లు అడుగంటడంతో వేసవిలో నగర, శివారువాసులకు నీటి ఎద్దడి తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇంకుడు గుంతల ఆవశ్యకత గుర్తుచేస్తున్నాయి.
News January 14, 2026
ఎమ్మిగనూరు ఎమ్మెల్యేకు ప్రత్యేక జిల్లా సెగ

ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మిగనూరు జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనకారులు అడ్డగించి నిరసన తెలిపారు. ఎమ్మిగనూరు జిల్లాపై కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని జేఏసీ నాయకులు రాజేశ్, రంగయ్య, చిన్నిప్రసాద్, లక్ష్మణ్ ఎమ్మెల్యేను కోరారు. ఎమ్మిగనూరు ప్రత్యేక జిల్లా కావడానికి అన్ని అర్హతలు ఉన్నాయని, జిల్లాగా ప్రకటించే వరకు పోరాటం ఆగదన్నారు.


