News February 23, 2025
బయ్యారం: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్

మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం నామలపాడులోని ఏకలవ్య పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సందర్శించి, పిల్లలతో ముచ్చటించారు. వారితో కలిసి భోజనం చేసి వసతి గృహంలో అందుతున్న సేవలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. పట్టుదలతో చదివి విద్యార్దులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలపాలని అన్నారు.
Similar News
News February 23, 2025
ఉమామహేశ్వరాలయానికి రూ.55.25 లక్షలు మంజూరు

గూడూరు మండలంలోని కంకటావ గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర వెంకటాచల వేణుగోపాల స్వామి దేవస్థానం పునరుద్ధరణకు రూ.55.25 లక్షలు మంజూరయ్యాయి. పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ అభ్యర్థన మేరకు దేవదాయ శాఖ ఈ నిధులను మంజూరు చేసినట్లు పలువురు పేర్కొన్నారు. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ ఆదేశాలను జారీ చేయడంతో గ్రామస్థులు, పెద్దలు వారికి ఆదివారం కృతజ్ఞతలు తెలిపారు.
News February 23, 2025
INDvsPAK మ్యాచ్ చూస్తున్న మంత్రి లోకేశ్, చిరు

ఏపీ మంత్రి నారా లోకేశ్, చిరంజీవి, ఎంపీ కేశినేని చిన్ని, ఫిల్మ్ డైరెక్టర్ సుకుమార్ తదితరులు దుబాయ్ వెళ్లారు. ఇండియా, పాకిస్థాన్ మ్యాచును వీక్షిస్తున్నారు. లోకేశ్, కేశినేని చిన్ని, సుకుమార్ కుటుంబ సభ్యులు టీమ్ ఇండియా జెర్సీని ధరించి స్టేడియానికి వచ్చారు.
News February 23, 2025
HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్‌నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.