News February 23, 2025
సత్యసాయి: HNSS ఫేస్-2 కాలువ మ్యాప్ పరిశీలన

హంద్రీనీవా సుజల స్రవంతి ఫేస్-2 సంబంధించిన కాలువ మ్యాప్‌ను శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ పరిశీలించారు. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్లో హంద్రీనీవా సుజల స్రవంతి అధికారులు, 2వ విడతలో చేపట్టాల్సిన పనుల గురించి మ్యాప్ ద్వారా కలెక్టర్‌కు వివరించారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఫేస్-2 పనులను ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది.
Similar News
News October 29, 2025
తుఫానుగా బలహీనపడ్డ మొంథా

AP: తీవ్ర తుఫానుగా తీరం దాటిన ‘మొంథా’ తుఫానుగా బలహీనపడినట్లు IMD పేర్కొంది. ‘నర్సాపూర్‌కు పశ్చిమ-వాయవ్య దిశలో 20K.M, మచిలీపట్నానికి ఈశాన్యంగా 50K.M, కాకినాడకు పశ్చిమ-నైరుతి దిశలో 90K.M, విశాఖకు నైరుతి దిశలో 230K.M, గోపాల్‌పూర్(ఒడిశా)కు నైరుతి దిశలో 470K.M. దూరంలో కేంద్రీకృతమై ఉంది. రాబోయే 6 గంటల పాటు తుఫాను ప్రభావం కొనసాగించి, తదుపరి 6 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
News October 29, 2025
సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లకు బాపట్ల కలెక్టర్ సూచనలు

తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కలెక్టర్ వినోద్ కుమార్ మంగళవారం రాత్రి జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్ వార్డెన్లకు సూచనలు చేశారు. వసతి గృహాలలోని విద్యార్థులు గోడలను తాకకుండా చూడాలన్నారు. తుఫాను ప్రభావంతో గోడలు తడి పడే అవకాశం ఉందని విద్యార్థుల భద్రత దృష్ట్యా సూచనలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
News October 29, 2025
కర్నూలు ప్రమాదం.. బస్సు డ్రైవర్ అరెస్ట్

AP: కర్నూలులో జరిగిన ఘోర <<18110276>>బస్సు ప్రమాదం<<>> కేసులో వేమూరి కావేరి ట్రావెల్స్ డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్టు చేశారు. A2గా ఉన్న బస్సు యజమాని కోసం గాలిస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన రమేశ్ అనే ప్రయాణికుడి ఫిర్యాదుతో ఉలిందకొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి 10 ని. ముందు అటుగా వెళ్లిన 35మంది డ్రైవర్లను ప్రశ్నించి.. లక్ష్మయ్య నిర్లక్ష్యమూ ప్రమాదానికి కారణమని గుర్తించి అరెస్టు చేశారు.


