News February 23, 2025

ఆస్ట్రేలియా రికార్డ్.. ICC టోర్నీల్లో హయ్యెస్ట్ ఛేజ్

image

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్‌పై విజయం సాధించి ఆస్ట్రేలియా రికార్డ్ సృష్టించింది. ఐసీసీ వన్డే టోర్నీల్లో హయ్యెస్ట్ రన్ ఛేజ్ చేసిన టీమ్‌గా నిలిచింది. నిన్న జరిగిన మ్యాచ్‌లో AUS 352 టార్గెట్‌ను ఛేదించింది. గతంలో ఈ రికార్డ్ పాకిస్థాన్ పేరిట ఉండేది. 2023 WCలో శ్రీలంక నిర్దేశించిన 345 లక్ష్యాన్ని పాక్ ఛేజ్ చేసింది. ఇక CTలో హయ్యెస్ట్ రన్ ఛేజ్ జట్టుగా శ్రీలంక(322) ఉండగా తాజాగా ఆసీస్ దాన్ని అధిగమించింది.

Similar News

News November 7, 2025

అరక అరిగిన గరిసె విరుగును

image

‘అరక’ అంటే పొలం దున్నడానికి ఉపయోగించే నాగలి. ‘గరిసె’ అంటే ధాన్యాన్ని నిల్వచేసే కొట్టం. ఒక రైతు తన నాగలి అరిగిపోయేంత కష్టపడి పొలం దున్నితే, ఆ శ్రమకు తగిన ఫలితం దక్కుతుందని, ధాన్యం దిగుబడి విపరీతంగా పెరిగి, ధాన్యాగారా(గరిసె)లు నిండిపోతాయని దీని అర్థం. ఎంత కష్టపడి శ్రమిస్తే, అంత గొప్ప ఫలితాలు లభిస్తాయి అనే నీతిని ఈ సామెత తెలియజేస్తుంది.

News November 7, 2025

పెళ్లి ఏ వయస్సులో చేసుకోవాలి?

image

అమ్మాయిలు 18, అబ్బాయిలు 21 ఏళ్లు దాటాక వివాహం చేసుకోవాలని సనాతన ధర్మం బోధిస్తోంది. దీని వెనుక ఆధ్యాత్మిక ఆంతర్యం కూడా ఉంది. వివాహ జీవితం సక్రమంగా సాగాలంటే శారీరక బంధం ఉంటే సరిపోదు. మానసిక, ఆధ్యాత్మిక పరిణతి కూడా చెంది ఉండాలి. పూర్వం యువతీ యువకులు వేదాలనభ్యసించి, జ్ఞానాన్ని, ధర్మాన్ని తెలుసుకున్నాకే పెళ్లి చేసుకునేవారట. ఇది ధర్మాన్ని నిలబెట్టి, మోక్ష మార్గానికి బాటలు వేస్తుందని నమ్మకం. <<-se>>#Sanathanam<<>>

News November 7, 2025

పూజకు ఏయే రత్నాలను ఉపయోగించాలి..?

image

‘సువర్ణ రజతం ముక్తా; రాజవర్తం ప్రవాలకం రత్న పంచక మాఖ్యాతం’ అంటే.. బంగారం, వెండి, ముత్యం, వజ్రపు శిల(రాజవర్తం), పగడం(ప్రవాలకం)లను పంచ రత్నాలుగా పరిగణించాలి. ఒకవేళ ఈ ఐదు రత్నాలు దొరకనట్లయితే ‘ఆభావే సర్వ రత్నానాం హేమ సర్వత్ర యోజయేత్’ అన్నట్లు.. వాటి స్థానంలో బంగారాన్ని మాత్రమే ఉపయోగించవచ్చు. అన్ని రత్నాలలోనూ ఉత్తమమైనది. సమస్త కార్యాలకు వినియోగించడానికి అర్హమైనది. అందుకే పసిడికంత ప్రాధాన్యం. <<-se>>#Pooja<<>>