News March 21, 2024

ప్రతి సోమవారం ఉపవాసం ఉంటా: సీజేఐ

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘నేను నా భార్య పూర్తి శాకాహారులం. మా జీవనశైలి మొక్కల ఆధారితం. మనం తీసుకునే ఆహారం మెదడుపై ప్రభావం చూపుతుందని మేము నమ్ముతాం. అలాగే 25 ఏళ్లుగా ప్రతి సోమవారం నేను ఉపవాసం ఉంటున్నా. రోజూ ఉదయం 3.30 గంటల సమయంలో యోగా చేస్తా. నాకు ఐస్‌క్రీమ్ అంటే ఇష్టం’ అని సీజేఐ చెప్పారు.

Similar News

News October 6, 2024

ఘోరం.. 1.7లక్షల మందికి ఒక్క టాయిలెట్!

image

బెంగళూరు అభివృద్ధిలో దూసుకెళ్తోంది. కానీ, అక్కడున్న 1.4 కోట్ల మంది ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన టాయిలెట్లను ఏర్పాటు చేయలేకపోయింది. నగరంలో 803 పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు RV యూనివర్సిటీ నివేదికలో వెల్లడైంది. ఈ లెక్కన ప్రతి 1.7లక్షల మందికి ఓ టాయిలెట్ ఉందన్న మాట. వీటిలోనూ సగం వాటిల్లో లైట్స్ లేవని తేలింది. కాగా HYDలోనూ టాయిలెట్స్ పెంచాలని నెటిజన్లు కోరుతున్నారు.

News October 6, 2024

కాంగ్రెస్ మోసాలపై నిలదీయండి.. యువతకు హరీశ్‌రావు పిలుపు

image

TG: గత ఏడాది దసరా సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను నమ్మి ఆ పార్టీకి ఓటు వేయాలని ప్రచారం చేసిన యువత ఓసారి ఆలోచించాలని హరీశ్‌రావు కోరారు. ‘పింఛన్ పెంచలేదు. పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసాకు దిక్కులేదు. బోనస్‌ను బోగస్ చేశారు. ఉద్యోగాల ఊసులేదు. రూ.4వేల భృతికి నీళ్లు వదిలారు. ఈ దసరాకు సొంతూళ్లకు వస్తున్న వారితో INC మోసాలపై చర్చించండి. ఆ పార్టీ నాయకులను నిలదీయండి’ అని Xలో పిలుపునిచ్చారు.

News October 6, 2024

మోదీ అలా చేస్తే బీజేపీ తరఫున ప్రచారం చేస్తా: కేజ్రీవాల్

image

ప్రధాని మోదీకి ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు ఎన్డీయే పాలిత 22 రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తే తాను బీజేపీ తరఫున ప్రచారం చేస్తానని స్పష్టం చేశారు. ఢిల్లీలో ప్రజాస్వామ్యం లేదని, లెఫ్టినెంట్ గవర్నర్ రాజ్యం నడుస్తోందని కేజ్రీవాల్ విమర్శించారు. కాగా ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల లోపు కరెంట్ ఫ్రీగా ఇస్తోంది.