News March 21, 2024
మాజీ సీఎంకి స్వాగతం పలికిన మంత్రి పొన్నం

తెలంగాణ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌కు హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్న ప్రభాకర్ గౌడ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. మంత్రితోపాటు సహచర మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు.
Similar News
News January 8, 2026
KNR: తెలంగాణ జాగృతి అధ్యయన కమిటీలో హరిప్రసాద్

తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీల అధ్యయన కమిటీ సభ్యుడిగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ నియమితులయ్యారు. నూతన రాజకీయ పార్టీ ఆవిర్భావ క్రమంలో వివిధ పార్టీల పనితీరును విశ్లేషించేందుకు జాగృతి అధ్యక్షురాలు కవిత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. కవితకు అత్యంత విధేయుడైన హరిప్రసాద్‌కు రాష్ట్ర స్థాయి కమిటీలో చోటు దక్కడంపై జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
News January 8, 2026
కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.


