News February 23, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. కోహ్లీ ఆడేనా?

image

పాకిస్థాన్‌తో మ్యాచ్‌‌లో భారత స్టార్ క్రికెటర్ కోహ్లీ ఆడటం అనుమానాస్పదంగా మారిందని జాతీయ మీడియా పేర్కొంది. నిన్న ప్రాక్టీస్ సెషన్‌లో కాలికి గాయం కావడంతో, ఐస్ ప్యాక్‌తో రెస్ట్ తీసుకుంటూ కనిపించినట్లు వెల్లడించింది. ఆ ఫొటోలు SMలోనూ చక్కర్లు కొడుతున్నాయి. అయితే కోహ్లీ గాయంపై BCCI ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో కీలక మ్యాచ్‌లో కోహ్లీ ఆడతాడని అంతా భావిస్తున్నారు. మ్యాచ్ సమయానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Similar News

News February 23, 2025

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ(158) రికార్డు సృష్టించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌ల జాబితాలో జయవర్దనే(218), రికీ పాంటింగ్(160) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.

News February 23, 2025

కుల్దీప్ 300.. హార్దిక్ 200

image

టీమ్ ఇండియా ప్లేయర్లు కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ 300, పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ వన్డేల్లో 176, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీయగా పాండ్య టీ20ల్లో 94, వన్డేల్లో 89, టెస్టుల్లో 17 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీ20ల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్య నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.

News February 23, 2025

ఆయన రెండు దశాబ్దాలు విపక్ష నేతగా ఉండాలి: మంత్రి

image

AP: మాజీ సీఎం జగన్ రేపు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో మంత్రి సుభాష్ పరోక్షంగా స్పందించారు. ‘CMగా ఎలాగో ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని ప్రజా తీర్పు అందుకున్నారు. MLAగా అయినా సభా మర్యాదలు పాటిస్తూ సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం. బాధ్యత గల విపక్ష నేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ రెండు దశాబ్దాలు మంచి విపక్ష నేతగా పేరు సంపాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.

error: Content is protected !!