News February 23, 2025

టన్నెల్ ఘటన.. కార్మికుల ప్రాణాలపై ఆందోళన

image

TG: SLBC టన్నెల్‌లో చిక్కుకున్న వారి ప్రాణాలపై ఆందోళన నెలకొంది. నిన్న ఉదయం 8-9 గంటల మధ్య టన్నెల్‌లో మట్టి కూలడం మొదలైంది. వెంటనే కొంతమంది బయటికి వచ్చినా 8 మంది మాత్రం అక్కడే చిక్కుకున్నారు. సాయంత్రానికి NDRF బృందం అక్కడికి చేరుకుంది. ఇవాళ్టి నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టనుంది. సముద్ర మట్టానికి 834 అడుగుల దిగువన కార్మికులు చిక్కుకుపోవడంతో వారికి ఆక్సిజన్ అందుతోందా? లేదా? అన్నదే కీలకంగా మారింది.

Similar News

News February 23, 2025

జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్ పేపర్-2 (BArch&B.Planning) ఫలితాలను NTA విడుదల చేసింది. <>https://jeemain.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అభ్యర్థులు తమ రిజల్ట్స్‌ను చెక్ చేసుకోవచ్చు. జనవరిలో జరిగిన ఈ పరీక్షలకు 62,740 మంది హాజరయ్యారు. BArchలో మహారాష్ట్రకు చెందిన నీల్ సందేశ్, B.Planningలో మధ్యప్రదేశ్‌కు చెందిన సునిధి సింగ్ 100 పర్సంటైల్ సాధించారు.

News February 23, 2025

గ్రూప్-2 వివాదంలో ఎవరి పాత్ర ఎంతంటే?: ఎమ్మెల్సీ చిరంజీవి

image

AP: గ్రూప్-2 వివాదంలో జగన్ పాత్రే అధికంగా ఉందని టీడీపీ MLC చిరంజీవి ఆరోపించారు. నోటిఫికేషన్ రావడం, రోస్టర్‌లో తప్పులు, హైకోర్టులో కేసులు జగన్ హయాంలోనే జరిగాయని దుయ్యబట్టారు. మెయిన్స్ FEB 23న పెట్టాలని హైకోర్టు సూచిస్తే విద్యార్థులు నష్టపోయే అవకాశముందని వాయిదా వేయాలని CBN కోరినట్లు తెలిపారు. పరీక్ష వాయిదాతో టీడీపీకి లబ్ధి అని YCP ఫిర్యాదు చేయగా రద్దు కుదరదని APPSC తేల్చినట్లు పేర్కొన్నారు.

News February 23, 2025

ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

image

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్‌కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.

error: Content is protected !!