News February 23, 2025
అరకులోయలో బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్..!

అల్లూరి కలెక్టర్ ఏ.ఎస్ దినేశ్ కుమార్ ఆదేశాల మేరకు అరకులోయ మండలంలో పబ్లిక్ ఎక్కువగా వచ్చే ప్రదేశాలలో బ్రెస్ట్ ఫీడింగ్ కోసం తల్లులకు రూమ్స్ కేటాయించినట్టు సీడీపీఓ శారద పేర్కొన్నారు. బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్స్‌ను అరకులోయ తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీసు, పెదలబుడు సచివాలయం, అరకు రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి, పోస్టర్లు అంటించామని సీడీపీఓ తెలిపారు. తల్లులు ఈ సౌకర్యాలను గమనించి వాడుకోవాలని ఆమె కోరారు.
Similar News
News November 4, 2025
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
News November 4, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.
News November 4, 2025
ఉండవెల్లి: ఆసుపత్రిలో మొదటి కాన్పు విజయవంతం

ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి మూడు నెలల క్రితం ప్రారంభమైన నిన్నటిదాకా ఒక కాన్పు కూడా జరగలేదు. ఎట్టకేలకు మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు పురుడోసుకుంది. మండల కేంద్రానికి చెందిన సంధ్య పండంటి పాపకు జన్మనిచ్చినట్లు స్టాఫ్‌నర్స్ లత తెలిపారు. ఆసుపత్రిలో అనుభవంగల డాక్టర్లు, స్టాఫ్‌నర్స్‌లు ఉన్నారని, గర్భిణీలు నిశ్చింతగా కాన్పులకు రావచ్చన్నారు.


