News February 23, 2025
HYD: ఫిబ్రవరిలోనే.. కరెంట్ డిమాండ్

గ్రేటర్ పరిధిలో సాధారణంగా మార్చి, ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కానీ.. 2022 ఏప్రిల్ నెలలో నమోదైన సగటు గరిష్ఠ డిమాండ్ 3435 మెగావాట్లు. ప్రస్తుతం ఫిబ్రవరిలోనే 3456 మెగావాట్లుగా నమోదవుతోంది. ఇక మార్చి, ఏప్రిల్ నెలలో డిమాండ్ ఎంత పెరుగుతుందో అని అధికారులు అంచనాలు వేశారు. దీనికి అవసరమైన చర్యలు చేపడుతున్నారు.
Similar News
News February 23, 2025
HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఈ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్‌నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లేస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకాథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.
News February 23, 2025
జిల్లాలో అప్పుడే.. 37.5℃ ఉష్ణోగ్రతలు

రంగారెడ్డి జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం అత్యధికంగా మొగల్‌గిద్దలో 37.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు ప్రోద్దటూర్, కాసులాబాద్, చందానవల్లి, తొమ్మిదిరేకుల 37.4, చుక్కాపూర్ 37.3, షాబాద్ 37.2, రెడ్డి పల్లి, మొయినాబాద్ 37.1, కేతిరెడ్డిపల్లి 37, తుర్కయాంజాల్ 36.8, మంగల్‌పల్లి 36.7, కేశంపేట్, యాచారం 36.6, కొత్తూరు, మహేశ్వరం 36.5, తోర్రూర్, కొండూర్గ్‌లో 36.4℃గా నమోదైంది.
News February 23, 2025
ఆదివారం: HYDలో పతనమవుతున్న చికెన్ ధరలు

HYDలో చికెన్ ధరలు పతనం అవుతున్నాయి. KG మీద ఏకంగా రూ.18 నుంచి రూ.20 వరకు తగ్గించారు. శుక్రవారం KG స్కిన్ లెస్ రూ 168, విత్‌స్కిన్ KG రూ.148గా ఉండగా.. నేడు మోరోసారి భారీగా పడిపోయాయి. KG స్కిన్‌లెస్ రూ.152, విత్ స్కిన్ రూ. 133 చొప్పున అమ్మకాలు జరుపుతున్నారు. హోల్‌సేల్ దుకాణాల్లో ఇంకా తగ్గించి విక్రయిస్తున్నారు. రిటైల్ షాపుల్లో మాత్రం ధరలు యథావిధిగా ఉంటున్నాయి. మీ ఏరియాలో KG చికెన్ ధర ఎంత?