News February 23, 2025

కృష్ణా: నానిలు సేఫేనా.?

image

వల్లభనేని వంశీ అరెస్ట్ తరువాత పేర్ని నాని, కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న గుసగుసలు విస్తృతంగా వినిపించాయి. కూటమి నాయకులు కూడా పలు సందర్భాల్లో నెక్స్ట్ అరెస్ట్ వారే అని చెప్పారు. ఇది ఇలా ఉండగా మీ అరెస్టులు వల్ల రోమాలు కూడా ఊడవని పేర్ని నాని అన్నారు. మూడు కాకపోతే 30 కేసులు ఉంటాయని కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. కాగా వీరన్న మాటలు ఇప్పుడు చర్చినీయాంశంగా మారాయి. 

Similar News

News February 1, 2026

రేపు కలెక్టరేట్‌లో PGRS, రెవెన్యూ క్లినిక్: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం (PGRS) కార్యక్రమాన్ని సోమవారం ఉదయం కలెక్టరేట్‌లో నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. అలాగే ఆర్డీఓ కార్యాలయ ఆవరణలో రెవెన్యూ సమస్యలపై రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు.

News February 1, 2026

కంకిపాడుకి చెందిన సినీ నటుడు రఘునాథ్ రెడ్డి మృతి

image

చిత్ర పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. కంకిపాడుకి చెందిన ప్రముఖ సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. తెలుగు, హిందీ, తమిళం, భోజ్‌పురి భాషల్లో దాదాపు 370కి పైగా చిత్రాల్లో నటించి మెప్పించిన ఆయన, బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేశారు. కొన్ని నెలల క్రితమే ఆయన కుమారుడు కూడా గుండెపోటుతో మరణించగా, ఇప్పుడు రఘునాథ్ రెడ్డి మృతితో ఆ కుటుంబం తీవ్ర శోకసముద్రంలో మునిగిపోయింది.

News February 1, 2026

అవనిగడ్డ అమ్మాయికి గ్రూప్–2లో ఉద్యోగం

image

అవనిగడ్డకు చెందిన సుధారాణి గ్రూప్–2 పరీక్షలో సెక్రటేరియట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం విశాఖపట్నంలో తపాలా శాఖ ఉద్యోగినిగా విధులు నిర్వహిస్తున్న ఆమె తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించారు. స్థానిక పాఠశాలలో చదివిన సుధారాణి పదో తరగతిలో 10 పాయింట్లు సాధించారు. 2016లో గ్రామీణ డాక్ సేవక్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి, హెడ్ పోస్ట్ ఆఫీస్ పోస్టు ఉమెన్‌గా పనిచేశారు.