News February 23, 2025
సిద్దిపేట: నేడే గురుకుల పరీక్ష

తెలంగాణలోని వివిధ గురుకులాలలో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే TG-CET-2025 ప్రవేశ పరీక్షకు సిద్దిపేట జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్యాడ్‌తో పాటు బ్లాక్, బ్లూ పెన్నులు, ఆధార్ కార్డ్, పాస్ ఫోటోలతో రావాలని సూచించారు. ఉదయం 11 నుంచి 1 వరకు జరిగే పరీక్షలకు ఉదయం 9 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొన్నారు.
Similar News
News February 23, 2025
కాంగ్రెస్‌కు దక్కేది గుండు సున్నానే: కిషన్‌రెడ్డి

TG: రాష్ట్రంలో బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విద్యావంతులు, టీచర్లను మోసం చేశాయి కాబట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పూర్తి స్థానాల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు.
News February 23, 2025
VKB: క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తున్న కబడ్డీ ప్లేయర్లు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని గౌలికర్ ఫంక్షన్ హాల్లో 34వ సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుల కోరిక మేరకు నిర్వాహకులు స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఇండియా, పాక్ మధ్య పోటీ రసవత్తరంగా ఉంటుందడానికి ఈ ఏర్పాటే నిదర్శనం. ఆదివారం సాయంత్రం కబడ్డీ ఫైనల్ పోటీలు జరగనున్నాయి.
News February 23, 2025
టెక్కలి: ప్రమాదవశాత్తు జారిపడి కూలీ మృతి

టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు జారిపడి మెలియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(36) అనే కూలీ మృతిచెందాడు. గోడౌన్ నుంచి సరకులను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లేందుకు రోజుకూలీ డ్రైవర్‌గా ఉన్న ఈయన ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.