News February 23, 2025
NGKL: శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులు.!

మహాశివరాత్రి సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి మొత్తం 58 బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రత్యేక బస్సు సర్వీసులను శివ స్వాములు, భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News March 1, 2026
ఆర్ట్స్ కళాశాలలో ముగిసిన ఎస్సీ స్టడీ సర్కిల్ పరీక్ష

ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ యువతకు వివిధ పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించేందుకు నిర్వహించిన ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. గ్రూప్-1, 2, 3, 4 తో పాటు RRB, బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఈ పరీక్షను ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్ ప్రొ.జ్యోతి, ఎస్సీ అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల పరీక్షా కేంద్రాలను సందర్శించి పర్యవేక్షించారు.
News March 1, 2026
Zero Discrimination Day.. Way2News Message..!

నేడు ప్రపంచ వివక్ష వ్యతిరేక దినోత్సవం. మనిషిని మనిషిగా గౌరవించడమే అసలైన నాగరికత. రంగు, రూపం, కులం, మతం.. ఇలా ఏ కారణంతోనైనా ఎవరినీ తక్కువ చేసి చూడటం నేరం. ముఖ్యంగా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు దక్కాలి. మన ఆలోచనల్లో మార్పు వస్తేనే సమాజం బాగుపడుతుంది. ఎదుటివారిని చిన్నచూపు చూడటం మానేసి ప్రేమాభిమానాలతో బతుకుదాం. 2026 థీమ్ ప్రకారం ‘మనుషులకే మొదటి ప్రాధాన్యం’ ఇద్దాం. ఇందుకు మనమే తొలి అడుగు వేద్దాం.