News February 23, 2025
కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో గ్రూప్-2 పరీక్ష

గ్రూప్-2 వాయిదా వేయాలంటూ ప్రభుత్వ చేసిన విజ్ఞప్తిని APPSC తిరస్కరించడంతో నేడు పరీక్షలు యథావిధిగా జరగనున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 30 కేంద్రాల్లో 9,993 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటలకు పేపర్-1, మ.3 గంటలకు పేపర్-2 పరీక్ష జరగనుంది. అభ్యర్థులు 15 నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News January 13, 2026
కర్నూలు జిల్లాకు వాటితో ముప్పు..!

కర్నూలు జిల్లాలోని రెండు మండలాల భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు ‘సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు’ తాజాగా హెచ్చరించింది. దేవనకొండ మండలం కరివేములలో అత్యధికంగా 50.7 ppb సాంద్రత నమోదవ్వగా, ఆదోని మండలం నాగనాథనహల్లిలో 63.6 ppb ఉన్నట్లు గుర్తించారు. 30 ppbలోపు ఉంటేనే సురక్షితమని, ఇంతటి భారీ సాంద్రత వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
News January 13, 2026
పందెం కోళ్లు.. పేర్లు తెలుసా?

AP: సంక్రాంతి వేళ రాష్ట్రంలోని పలు చోట్ల బరులు, కాళ్ల బలం చూపించేందుకు కోళ్లు సిద్ధమయ్యాయి. నెలలుగా ప్రత్యేక శిక్షణ, ఆహారం ఇచ్చి రెడీ చేసిన తమ కోళ్లను బరిలో దించి గెలిచేందుకు యజమానులు వ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా సేతు, కాకి, డేగ, నెమలి, పర్ల, రసంగి, కిక్కిరాయి, మైల, పింగళి, అబ్రాస్ రకాలను బరిలో దించుతుంటారు. కోళ్ల ఈకల రంగు, మెడ, కాళ్ల సైజు, శరీర తత్వాన్ని బట్టి వాటికి పేర్లు పెడతారు.
News January 13, 2026
కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఎస్పీ నరసింహ

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నరసింహ హెచ్చరించారు. పండుగను సంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. మహిళలు అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, బంగారు ఆభరణాల దొంగతనాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు నిఘా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు.


