News February 23, 2025
విజయవాడ: సొంత చెల్లినే గర్భవతి చేసిన అన్న

మానవ సంబంధాలను మంట గలిపే దారుణ ఘటన ప్రకాశం (D) కొండపి మండలంలో వెలుగు చూసింది. విజయవాడలోని తల్లి వద్ద ఉంటున్న పెద్ద చెల్లిని, అన్న గతేడాది క్రిస్మస్కు పెట్లూరుకు తీసుకొచ్చాడు. పండుగ అనంతరం చెల్లిని విజయవాడలో వదిలిపెట్టకుండా తన వెంట హైదరాబాద్ తీసుకువెళ్లాడు. కొన్నాళ్లకు అనారోగ్యంతో తల్లి వద్దకు చేరుకున్న కుమార్తెకు వైద్య పరీక్షలు చేయగా గర్భవతి అని తేలింది. విషయం తల్లికి చెప్పడంతో కేసు పెట్టింది.
Similar News
News February 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ(158) రికార్డు సృష్టించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌ల జాబితాలో జయవర్దనే(218), రికీ పాంటింగ్(160) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.
News February 23, 2025
కుల్దీప్ 300.. హార్దిక్ 200

టీమ్ ఇండియా ప్లేయర్లు కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్లో కొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ 300, పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ వన్డేల్లో 176, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీయగా పాండ్య టీ20ల్లో 94, వన్డేల్లో 89, టెస్టుల్లో 17 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీ20ల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్య నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.
News February 23, 2025
నెల్లూరు: ప్రశాంతంగా ముగిసిన CM పర్యటన

నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం టీడీపీ నాయకుడు బీద రవిచంద్ర కుమారుడి వివాహం జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు ఈ సందర్భంగా నెల్లూరులో జిల్లా ఎస్పీ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సీఎం పర్యటనను విజయవంతం చేశారు. దీంతో అందరికీ జిల్లా ఎస్పీ దన్యవాదాలు తెలియజేశారు.