News February 23, 2025

నిర్మల్: ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా తమ విధుల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లు అధికారులకు ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత నిర్వహించవలసిన విధులపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.

Similar News

News December 3, 2025

బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

image

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.

News December 3, 2025

భారీ ఎన్‌కౌంటర్.. 15 మంది మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా దంతెవాడ అడవుల్లో జరిగిన భారీ <<18458130>>ఎన్‌కౌంటర్‌లో<<>> మృతుల సంఖ్య పెరిగింది. ఎదురుకాల్పుల్లో 12 మంది మావోలు మరణించగా ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. ఘటనాస్థలం నుంచి మావోలకు సంబంధించిన భారీ ఆయుధాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు జనవరి 1న అంతా లొంగిపోతామని ఇటీవల అభయ్ పేరిట మావోయిస్టు పార్టీ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

News December 3, 2025

NGKL: ఉపసంహరణ పూర్తి.. గుర్తుల కేటాయింపు

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పర్వం బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. నామినేషన్లు ఉపసంహరించుకున్న అనంతరం బరిలో ఉన్న అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులను కేటాయించారు. ఉంగరం గుర్తుతో పాటు కత్తెర, బ్యాటు, ఫుట్‌బాల్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్ తదితర గుర్తులను కేటాయించారు.