News February 23, 2025
సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదు: డాక్టర్

సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూ లేదని వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పెంటయ్య అన్నారు. ఏపీలో బర్డ్ ఫ్లూ నేపథ్యంలో వ్యాధి సోకిన కోళ్లు రాకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. శనివారం అనంతగిరి మండలం కిష్టాపురంలో ఓ కోళ్లఫారాన్ని సందర్శించారు. కోళ్లకు దాణా, నీరు నిలిపివేయడం మూలంగానే కోళ్లు చనిపోతున్నాయని చెప్పారు. ఫాం యజమానులకు పలు సూచనలు చేశారు.
Similar News
News November 12, 2025
పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని

ఢిల్లీ LNJP ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పేలుడు బాధితులను ప్రధాని మోదీ పరామర్శించారు. ఆస్పత్రికి వెళ్లి వారి ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల బృందంతో సమావేశమై మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కాగా ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో 12 మంది పౌరులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు.
News November 12, 2025
తొలి టెస్టులో పంత్, జురెల్ ఆడవచ్చేమో: డస్కాటే

ఈ నెల 14 నుంచి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టులో పంత్, జురెల్ ఇద్దరూ ఆడే అవకాశం ఉందని IND అసిస్టెంట్ కోచ్ డస్కాటే వెల్లడించారు. ఇలా జరగకపోతే ఆశ్చర్యపోవాల్సిన విషయమేనన్నారు. ఇటీవల SA-Aతో జరిగిన అనధికార టెస్టులో జురెల్ <<18235138>>రెండు సెంచరీలు<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇద్దరు కీపర్లలో ఒకరిని బ్యాటర్‌గా ఆడించనున్నట్లు తెలుస్తోంది. అటు ఆల్‌రౌండర్ నితీశ్‌కు ఆడే అవకాశం రాకపోవచ్చని డస్కాటే పేర్కొన్నారు.
News November 12, 2025
పిల్లలు ఎక్కువసేపు కూర్చొనే ఉంటున్నారా?

బాల్యంలో ఎక్కువసేపు కదలకుండా కూర్చొనేవారికి పెద్దయ్యాక గుండెపోటు, పక్షవాతం ముప్పు పెరుగుతున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్‌లాండ్ అధ్యయనం హెచ్చరిస్తోంది. బరువు, రక్తపోటు మామూలుగానే ఉన్నా కూర్చొనే సమయం పెరుగుతున్నకొద్దీ గుండెజబ్బు, పక్షవాతం, మరణం ముప్పు రెండింతలు ఎక్కువవుతోంది. కాబట్టి పిల్లలను వీలైనంత వరకు చురుకుగా ఉండేలా ప్రోత్సహించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.


