News February 23, 2025
మహా శివరాత్రి స్పెషల్ బస్సుల్లో 50 శాతం ఎక్స్‌ట్రా ఛార్జీ

TG: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 24 నుంచి 28 వరకు 43 శైవ క్షేత్రాలకు 3 వేల స్పెషల్ బస్సులను నడుపుతామని TGSRTC వెల్లడించింది. వీటిలో 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తామని, మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుందని తెలిపింది. శ్రీశైలం, వేములవాడ, ఏడుపాయల, కీసరగుట్ట, వేలాల, కాళేశ్వరం, కొమరవెల్లి, అలంపూర్, రామప్పకు ఈ బస్సులు వెళ్తాయని పేర్కొంది. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయంది.
Similar News
News February 23, 2025
కుల్దీప్ 300.. హార్దిక్ 200

టీమ్ ఇండియా ప్లేయర్లు కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య అంతర్జాతీయ క్రికెట్‌లో కొత్త మైలురాయిని చేరుకున్నారు. మూడు ఫార్మాట్లలో కలిపి కుల్దీప్ 300, పాండ్య 200 వికెట్లు తీశారు. కుల్దీప్ వన్డేల్లో 176, టీ20ల్లో 69, టెస్టుల్లో 56 వికెట్లు తీయగా పాండ్య టీ20ల్లో 94, వన్డేల్లో 89, టెస్టుల్లో 17 వికెట్లు తీశారు. ప్రస్తుతం టీ20ల్లో ఆల్‌రౌండర్ల జాబితాలో పాండ్య నం.1 ర్యాంకులో కొనసాగుతున్నారు.
News February 23, 2025
ఆయన రెండు దశాబ్దాలు విపక్ష నేతగా ఉండాలి: మంత్రి

AP: మాజీ సీఎం జగన్ రేపు అసెంబ్లీకి రానున్న నేపథ్యంలో మంత్రి సుభాష్ పరోక్షంగా స్పందించారు. ‘CMగా ఎలాగో ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వని ప్రజా తీర్పు అందుకున్నారు. MLAగా అయినా సభా మర్యాదలు పాటిస్తూ సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం. బాధ్యత గల విపక్ష నేతగా ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ రెండు దశాబ్దాలు మంచి విపక్ష నేతగా పేరు సంపాదించాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News February 23, 2025
కాంగ్రెస్‌కు దక్కేది గుండు సున్నానే: కిషన్‌రెడ్డి

TG: రాష్ట్రంలో బీజేపీ మాత్రమే 3 ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. విద్యావంతులు, టీచర్లను మోసం చేశాయి కాబట్టే కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు పూర్తి స్థానాల్లో అభ్యర్థులను నిలిపే సాహసం చేయలేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, ఇప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కదన్నారు.