News February 23, 2025

భద్రాద్రి: మహాశివరాత్రి.. మరో మూడు రోజులే..!

image

మహాశివరాత్రి వేడుకలకు భద్రాద్రి జిల్లాలోని పలు దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. మణుగూరులోని నీలకంఠేశ్వరాలయం, అన్నపురెడ్డిలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున ఆలయం, కనకగిరిగుట్ట మీద వీరభద్ర ఆలయం, బూర్గంపాడులోని మోతెగడ్డ ఆలయం, దేవాలయాలు జాగారం ఉన్న భక్తులతో కిటకిటలాడుతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

Similar News

News September 19, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 19, శుక్రవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.52 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.10 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.27 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 19, 2025

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట వాసి

image

శ్రీశైలం దేవస్థానం ఛైర్మన్‌గా రాజంపేట పట్టణం వైబిఎన్ పల్లెకు చెందిన పోతుగుంట రమేశ్ నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈయన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నంద్యాల జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు. ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు.

News September 19, 2025

తెలంగాణ బొగ్గు బ్లాక్‌లను ఈ ఆక్షన్‌లో చేర్చాలి

image

సింగరేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకన్న జాదవ్ ఢిల్లీలోని బొగ్గు గనుల మంత్రిత్వశాఖలో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. అక్టోబర్ 2025లో జరగే బొగ్గు బ్లాక్ ఈ-ఆక్షన్ ప్రక్రియపై సింగరేణి సంస్థ తరఫున తెలంగాణ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్‌లను ఈ-ఆక్షన్ జాబితాలో చేర్చాలని కోరారు. ఈ సమావేశంలో మళ్లీ ప్రస్తావించారు. సింగరేణి సంస్థకు మాత్రమే కాకుండా రాష్ట్రానికి, దేశానికి ప్రయోజనం కలుగుతుందన్నారు.