News February 23, 2025

నాగర్‌కర్నూల్: యువతి SUICIDE

image

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.

Similar News

News January 2, 2026

HYDలో ఎన్నికలు ఎప్పుడంటే?

image

గ్రేటర్ HYDను మూడు భాగాలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటికి ఎన్నికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఎండా కాలం ముగిసిన తర్వాతే అంటే జూన్ తర్వాత ‘గ్రేటర్’ ఎలక్షన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత కౌన్సిల్ గడువు వచ్చేనెల 10వరకు ఉంది.

News January 2, 2026

తిరుపతి: ALERT.. అలా చేస్తే ఇక డ్రైవింగ్ చేయలేరు.!

image

37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా తిరుపతిలో పోస్టర్లను ఆవిష్కరించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 31వ తేదీ వరకు “శిక్షణతో భద్రత, సాంకేతికతతో పరివర్తన” నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మద్యం తాగి వాహనం నడిపితే మూడు నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించారు.

News January 2, 2026

IIM బుద్ధగయలో నాన్ టీచింగ్ పోస్టులు

image

<>IIM<<>> బుద్ధగయ 28 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు JAN 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, BE/B.Tech, మేనేజ్‌మెంట్ డిప్లొమా, MBA, LLB, PG, CA, M.Phil(హిందీ), PG(సైకాలజీ), డిప్లొమా, B.LiSc, MCA, BBA/BCA, BSc(హార్టికల్చర్), M.Tech, MCom ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: iimbg.ac.in