News February 23, 2025

NGKL: యువతి SUICIDE

image

కల్వకుర్తిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాలిలా.. పట్టణంలోని ఇందిరానగర్‌లో ఉంటున్న అనూష(20) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఇంటర్ విద్యార్థి ఆమె ప్రేమించుకుంటున్నారు. కాగా.. మంగళవారం సదరు విద్యార్థితో అనూష ఫోన్ మాట్లాడిన అనంతరం పురుగు మందు తాగగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. పోస్టుమార్టంలో యువతి గర్భందాల్చినట్లు ఆరోపణలున్నాయి. కేసు నమోదైంది.

Similar News

News February 1, 2026

వనపర్తి: 9 మంది చిన్నారులకు అస్వస్థత

image

వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం ఎస్సీ వాడకు చెందిన నందిని, నైని, కిషోర్, ఆనంది, హేమంత్, రక్షిత, యశ్వంత్, హిమాన్షు, సౌమ్య అడవి ఆముదం కాయలు తిని అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఆడుకుంటూ వీటిని తినడంతో అందరికీ వాంతులయ్యాయి. స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News February 1, 2026

NRPT జిల్లాలో 71 మంది బాల కార్మికులకు విముక్తి

image

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా జిల్లాలో నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 71 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందం జిల్లాలోని మెకానిక్ దుకాణాలు, కిరాణా షాపులు, ఇటుకల బట్టిలు, హోటల్స్ లలో పని చేస్తున్న బాల కార్మికులను చైల్డ్ వెల్ఫెర్ అధికారులకు అప్పగించినట్లు చెప్పారు.

News February 1, 2026

‘NRPT జిల్లాలో నెల రోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు’

image

జిల్లాలో ఇవాల్టి నుంచి ఈనెల 28 వరకు పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉంటుందని నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. పోలీసుల అనుమతులు లేకుండా యువజన, రైతు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు సభలు, సమావేశాలు, బహిరంగ సభలు, నిరసన ర్యాలీలు నిర్వహించరాదని చెప్పారు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.