News February 23, 2025
జీతాలు 9.2 శాతం పెరుగుతాయ్: Aon సర్వే

ప్రపంచవ్యాప్తంగా వృద్ధిరేటు తగ్గుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్‌లో <<15458704>>వేతనాలు<<>> సగటున 9.2 శాతం పెరుగుతాయని Aon PLC అంచనా వేసింది. ఈ గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంస్థ 45 రంగాలకు చెందిన 1,400కు పైగా కంపెనీల నుంచి వివరాలు సేకరించింది. ఆటోమోటివ్, వెహికల్ తయారీ విభాగాల్లో అత్యధికంగా 10.2 శాతం పెంపు ఉండొచ్చని పేర్కొంది. ఆ తర్వాత NBFC(10%), రిటైల్(9.8%), ఇంజినీరింగ్, రియల్ ఎస్టేట్(9.5%) రంగాలు ఉంటాయంది.
Similar News
News February 23, 2025
ప్లాస్టిక్ రహిత పెళ్లి

TG: ఖమ్మం జిల్లాలో ఓ జంట వినూత్న రీతిలో పెళ్లి చేసుకుంది. వెంకటాయపాలెంలో సంపత్, నవ్య ఒక్క ప్లాస్టిక్ వస్తువు లేకుండా పెళ్లి తంతు ముగించారు. ప్లాస్టిక్ ప్లేట్లకు బదులు అరిటాకులు, మట్టి గ్లాసులు.. ఇలా ప్రతిదీ పర్యావరణహితమైనవే వాడారు. అందరూ ఈ జంటను స్ఫూర్తిగా తీసుకుని ప్లాస్టిక్ భూతాన్ని పక్కనబెట్టాలని పలువురు సూచిస్తున్నారు.
News February 23, 2025
ఐసీసీ ఛైర్మన్‌తో మంత్రి లోకేశ్ భేటీ

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్‌లో ఐసీసీ ఛైర్మన్ జైషాతో భేటీ అయినట్లు AP మంత్రి లోకేశ్ తెలిపారు. ‘జైషాను కలవడం ఆనందంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంపై ఆయనతో చర్చించా. మా ఇద్దరికీ ఇది చాలా ఇష్టమైన అంశం’ అని జైషాతో తీసుకున్న ఫొటోను Xలో పోస్ట్ చేశారు. ఈ మ్యాచుకు తన కొడుకు దేవాన్ష్‌ను కూడా ఆయన తీసుకెళ్లారు.
News February 23, 2025
ఆ జిల్లాల్లో 3 రోజులు వైన్ షాపులు బంద్

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.