News February 23, 2025
నంద్యాల జిల్లాలో కిలో చికెన్ ఎంతంటే?

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్‌కు డిమాండ్ తగ్గింది. ఎక్కువ మంది నాటుకోడి, మటన్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇవాళ కిలో చికెన్ రూ.140-160 పలుకుతోంది. నాటుకోడి కిలో రూ.350-400, మటన్ కిలో రూ.700-750లతో విక్రయాలు సాగుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Similar News
News January 11, 2026
రాజమార్గం కానున్న.. HYD నుంచి ORR కారిడార్.!

HYD నుంచి ORR చేరుకోవాలంటే సిటీ ట్రాఫిక్ కష్టాల్లో గంటల సమయం వెచ్చించాల్సిన పరిస్థితి. ఇక త్వరలో ఈ తిప్పలు తీరనుంది. HYD పారడైజ్ జంక్షన్ నుంచి ORR శామీర్‌పేట జంక్షన్ వరకు 18 KM కారిడార్ నిర్మాణం జరగనుంది. ఇందులో 11.5KM ఎలివేటెడ్, 6KM ఎట్ గ్రేడ్, 0.5KM అండర్ గ్రౌండ్ కారిడార్ నిర్మిస్తారు. ఈప్రాజెక్ట్ పూర్తయితే ఇక ORR వెళ్లేందుకు రాజమార్గం కానుందని ఓ అధికారి తెలిపారు.
News January 11, 2026
కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడి అరెస్ట్

కాజీపేటలో గంజాయి విక్రయిస్తున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కడిపికొండ బ్రిడ్జి సమీపంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా కిలో గంజాయి, ఒక మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు బండి నూతన ప్రసాద్ (20) తూర్పు గోదావరి జిల్లా చిన్నయ్యపాలెం వాసిగా గుర్తించారు. NDPS Act కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై బి.శివ తెలిపారు.
News January 11, 2026
మంథని అభివృద్ధికి రూ.45 కోట్లతో శ్రీధర్ బాబు శంకుస్థాపన

మంథని మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు రూ.45 కోట్ల రూపాయలతో ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోమవారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో బస్ స్టాండ్‌లు, కుల సంఘాల కమ్యూనిటీ హాల్‌లు, సీసీ రోడ్ల నిర్మాణాలు, బ్రిడ్జి నిర్మాణం, దేవాలయాల సుందరీకరణ పనులు, ఈద్గా నిర్మాణం పనులు, వయోవృద్ధుల డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవం, మహిళా సంఘం భవన నిర్మాణం పనులు ఉన్నాయి. వీటితో మంథనికి మహర్దశ పట్టనున్నది.


