News February 23, 2025
రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగం ఉండనుంది. ఆ తర్వాత జరిగే BAC సమావేశంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఈనెల 25న చర్చ జరగనుంది. 26న శివరాత్రి, 27న MLC ఎన్నికల నేపథ్యంలో సభ ఉండదు. 28న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 3 నుంచి బడ్జెట్‌పై చర్చ జరగనుంది.
Similar News
News February 23, 2025
ఆ జిల్లాల్లో 3 రోజులు వైన్ షాపులు బంద్

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.
News February 23, 2025
పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
News February 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ(158) రికార్డు సృష్టించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌ల జాబితాలో జయవర్దనే(218), రికీ పాంటింగ్(160) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.