News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News February 23, 2025
హైదరాబాద్: సీఎం విజన్‌కు అనుగుణంగా చర్యలు: HMR MD

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తర్వాత నాల్గో నగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు అనుగుణంగా చర్యలు ప్రారంభించినట్లు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్‌ను అధికారులు, సిబ్బందితో కలిసి ఆదివారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలుష్య రహిత హరిత నగరంగా, ఫ్యూచర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్టుకు HMR డీపీఆర్ సిద్ధం చేస్తోందని వెల్లడించారు.
News February 23, 2025
HYD: చీర కట్టి.. పరుగు పెట్టి..!

‘చీరలోని గొప్పతనం తెలుసుకో.. ఆ చీర కట్టి ఆడతనం పెంచుకో’ అనే పాట వినే ఉంటారు. చీర కట్టుతో అందంగా కనిపించడమే కాదు ఫిట్నెస్ కూడా సాధ్యమేనని పలువురు మహిళలు చాటి చెప్పారు. HYD నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఓ ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో శారీ రన్(SAREE RUN) నిర్వహించారు. ఈ వాకథాన్‌లో 3,120 మంది మహిళలు చీరకట్టుతో పాల్గొన్నారు. వీరిలో ఓ మహిళ తన బిడ్డతో పాటు పాల్గొని పరుగులు పెట్టడం అందరినీ ఆకర్షించింది.
News February 23, 2025
HYD: SLBC ప్రమాదం.. BRS సర్కార్ నిర్లక్ష్యం: చాడ

SLBC వద్ద జరిగిన ప్రమాదంలో అనేక పరిణామాలు ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. SLBC ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ మార్గమని, 20సార్లు మార్పులు చేయడం వల్ల సొరంగ మార్గం అంచనాలు పెరిగి మరింత ఆలస్యం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ కాలంలో పనులు చేపట్టకపోవడంపై కప్పు స్లాబ్ తుప్పు పట్టి ఈ ప్రమాదం జరిగిందన్నారు. ఇది గత ప్రభుత్వ నిర్లక్ష్యమన్నారు.