News February 23, 2025

పిల్లర్లు లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం?

image

TG: సిమెంట్, స్టీల్ ఖర్చు లేకుండా ఉండేందుకు ఇందిరమ్మ ఇళ్లను పిల్లర్లు లేకుండా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పిల్లర్ల నిర్మాణానికి వ్యయం ఎక్కువై లబ్ధిదారులు ఇళ్లను అసంపూర్తిగా ఆపేస్తారనే కారణంతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మండలానికి ఒకటి చొప్పున మోడల్ ఇళ్లను నిర్మించనుంది. పిల్లర్లు, బీములు లేకుండా నిర్మించేందుకు ‘న్యాక్‌’లో కొందరు మేస్త్రీలకు శిక్షణ ఇచ్చింది.

Similar News

News February 23, 2025

ఆ జిల్లాల్లో 3 రోజులు వైన్ షాపులు బంద్

image

TG: గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

News February 23, 2025

పవన్ అధ్యక్షతన జనసేన శాసనసభ పక్ష సమావేశం

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశం ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రేపటి నుంచి మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన విధానాలపై నేతలకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.

News February 23, 2025

కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

image

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు చేరింది. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక క్యాచులు అందుకున్న క్రికెటర్‌గా కోహ్లీ(158) రికార్డు సృష్టించారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రెండు క్యాచ్‌లు అందుకుని ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్(156)ను విరాట్ అధిగమించారు. ఓవరాల్‌గా అత్యధిక క్యాచ్‌ల జాబితాలో జయవర్దనే(218), రికీ పాంటింగ్(160) తర్వాత మూడో స్థానంలో నిలిచారు.

error: Content is protected !!